జీ. ఓ.నెంబర్ మాస్. 317 ని రద్దు చెయ్యాలి
ఐక్య వేదిక ఆరోగ్య సంఘాల ఐక్య వేదిక డిమాండ్
రిపబ్లిక్ హిందుస్థాన్, వరంగల్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగలను వారి స్థానికతని బట్టి వారి వారి సొంత జిల్లాలకు, సొంత జోన్లకు కేటాయించే ప్రక్రియలో భాగంగా డిసెంబర్ 6, 2021 న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో ఎంఎస్ 317 లో తప్పులతడకగా ఉందని దాన్ని వెంటనే రద్దు చేయాలని తెలంగాణ ఉద్యోగుల ఐక్య వేదిక ఉపాద్యాయ నాయకులు డిమాండ్ చేశారు. తెలంగాణ ఉపాధ్యాయ ఐక్య వేదిక ఆధ్వర్యంలో బుధవారం హనుమకొండ డీ.ఎం.అండ్ ఎచ్. ఓ. నందు జరిగిన సమావేశంలో బత్తిని సుదర్శన్ గౌడ్ మాట్లాడుతూ రాజ్యాంగంలోని 371 డ్ ఆర్టికల్ క్లాస్ 1 అండ్ 2 ప్రకారం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల వారికి సమానమైన అవకాశాలు వసతులు ఉండాలని పేర్కొనడం జరిగిందని తెలిపారు. దాని స్ఫూర్తితో 124 గో ని 2018 ఆగష్టు లో రాష్ట్రపతి ఉత్తర్వులు వెలువడ్డాయి. దీనికి మూడు సంవత్సరాల గడువు ఇవ్వబడింది.ఈ గడువు 2018 ఆగస్టు చివరి కల్లా ముగిసింది. దీంట్లో స్థానికత ఆధారంగా ప్రస్తుతం పని చేస్తున్న ఉద్యోగలను వారి స్థానికతను బట్టి సొంత జిల్లాలకు సొంత జోన్ లకు కేటాయించవలసి ఉంది. కానీ రాష్ట్రపతి ఉత్తర్వుల స్ఫూర్తికి భిన్నంగా సీనియారిటీ ప్రాతిపదికన ఉద్యోగలును కేటాయించడం జరుగుచున్నదని అన్నారు. క్రొత్తగా అప్పోయింట్ అయిన జూనియర్ అసిస్టెంట్ దూర ప్రాంతాలకు ట్రాన్ఫర్ చేయడం వలన పిల్లల చదువులు కుటుంబ సమస్యలు తల్లి దండ్రుల ఆరోగ్య సమస్యలు ఇంకా చెప్పలేని ఎన్నో సమస్యలు తీవ్ర మనోవేదనకు గురిచేస్తున్నాయి. దీన్ని ఐక్య వేదిక ఆరోగ్య సంఘల పూర్తిగా వ్యతిరేకిస్తున్నదని అన్నారు. ఈ ప్రక్రియలో స్థానికతను పాటించకపోతే ఆయా స్థానిక ప్రాంతాల నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పనలో తీవ్ర అన్యాయం జరుగుతుంది. కాబట్టి వెంటనే ఈ ప్రక్రియను నిలుపుదల చేయాలని డిమాండ్ చేస్తుంది.317 జీవోలో , నాయకులను అలాట్మెంట్ కమిటీలో భాగస్వాములుగా చేయడం వల్ల భారీ ఎత్తున అక్రమాలు సీనియార్టీ లిస్టు లో కూడా భారీ అవకతవకలు చోటుచేసుకుంటున్నాయని పేర్కొన్నారు. మొత్తంగా ప్రస్తుతం చేపడుతున్న ప్రక్రియను రద్దుచేసి తదుపరి ప్రక్రియను పూర్తిస్థాయి పారదర్శకతతో ఆన్లైన్ పద్ధతిలో ఉద్యోగాలకు వెబ్ ఆప్షన్స్ ఇచ్చి స్థానికత ఆధారంగా నిర్వహించాలని ఐక్య వేదిక ఆరోగ్య సంఘ ల సెంట్రల్ డిమాండ్ చేసింది. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి 317 జీవోను బేషరతుగా రద్దుచేసి స్థానికత ఆధారంగా ఉద్యోగలు అందర్నీ వారి వారి సొంత జోన్లకు సొంత జిల్లాలకు కేటాయించాలి లేనిచో ఉద్యోగలను చైతన్య పరిచి భారీ ఎత్తున భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం అని ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. ఈ కార్యక్రమం లో వైద్య ఆరోగ్య సంఘాల ఐక్య వేదిక ఉద్యోగులు సెంట్రల్ కమిటీ బానోతు నెహ్రు చెందు, రామ రాజేష్ ఖన్నా , అన్నపూర్ణ , కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments