వాట్సాప్ టీకా స్లాట్ బుకింగ్ చేసుకోండి ఇలా..!
రిపబ్లిక్ హిందుస్థాన్: కరోనా మహమ్మారి నుంచి రక్షణపొందేందుకు టీకాలు ఒక్కటే సరైన మార్గం. మూడో దశ ముప్పు పొంచి ఉందని వార్తలు వస్తున్న క్రమంలో అర్హులందరికీ టీకాలు అందివ్వాలని కేంద్ర సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది. దీనిలో భాగంగా వ్యాక్సినేషన్ బుకింగ్‌పై కేంద్ర ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకువచ్చింది. పౌరుల సౌలభ్యం కోసం మొబైల్ ఫోన్లలో ఉండే వాట్సాప్ ద్వారానే టీకా స్టాట్‌లు బుక్ చేసుకునే వీలు కల్పించింది.
దీనికి సంబంధించి ఇవాళ కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సూక్ మాండవీయ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
“దేశ పౌరుల సేవలో కొత్త శకానికి నాంది పలుకుతున్నాం.. ఇక కరోనా వ్యాక్సిన్ స్లాట్లను అత్యంత సువువుగా మీ ఫోన్ ద్వారా క్షణాల్లో బుక్ చేసుకోవచ్చు“ అని మంత్రి వెల్లడించారు.
ఎలా బుక్ చేసుకోవాలంటే..
ఇందుకోసం ముందు MyGovIndia Corona Helpdesk నంబరు 919013151515ను మీ మొబైల్‌లో సేవ్ చేసుకోవాలి.
ఆ తర్వాత వాట్సాప్‌లో నంబరుకు ఆరు అంకెల ఓటిపి వస్తుంది. ఆ ఓటిపిని ఎంటర్ చేసి నంబరు వెరిపై చేసుకోవాలి
ఆ తర్వాత తేదీ, లొకేషన్, పిన్‌కోడ్, వ్యాక్సినేషన్ టైప్ తదితర వివరాలు నింపాలి.
అన్నీ పూర్తయ్యాక Confirm చేస్తే మీకు స్లాట్ బుక్ అవుతుంది.
Recent Comments