రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :
మహిళను,మైనర్ బాలికను వేధించిన కేసులో నిందితునికి 5 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష మరియు 5 వేల రూపాయల జరిమానా విధిస్తు పొక్సో కోర్ట్ న్యాయమూర్తి డి మాధవి కృష్ణ తీర్పునిచ్చారు.
కేసు వివరాఇలా ఉన్నాయి…
2014 సంవత్సరంలో ఆదిలాబాద్ పట్టణంలోని మార్కెట్ యార్డ్ చుట్టుపక్కల నివసిస్తున్న కొందరి ప్రజలకు ఇండ్లలో మరుగుదొడ్లు అందుబాటులో లేనందున ప్రజలు బహిర్భూమికి చుట్టుపక్కల గల పొదలలో వెళ్తుండేవారు. దీని ఆసరాగ తీసుకొని నిందితుడు *మహమ్మద్ అజార్ ఖాన్ (40) s/o మహబూబ్ ఖాన్* రైల్వే గేట్ వడ్డెర కాలనీ నివాసుడు భైర్భూమికి వెళ్లే మహిళలు ఒంటరిగా ఉన్నప్పుడు నేరస్థుడు వెంబడించి చీరలు లాగడం మోటార్ సైకిల్ పై వెళ్తూ చెంపలపై కొడుతూ, బండి ఆపి అసభ్యంగా ప్రవర్తించడం చేస్తుండేవాడు. ఇట్టి విషయం తమ ఇంట్లో వారికి చెప్పిన ఆయన ప్రవర్తన మారలేదు.
తేదీ 26-12-2014 సాయంత్రం 5:30 గంటల సమయంలో ఒక మహిళ మరియు మైనర్ బాలిక బహిర్భూమికై గోదాముల తరపున వెళ్తుంటే సదరు నేరస్థుడు వచ్చి అట్టి మహిళను స్వెటర్ పట్టి లాగి ఓయ్ పండుకో అని బెదిరించి, బాలికను చెయ్యి పట్టుకుని లాగా, వారి అరుపులు విన్న మిగిలిన స్త్రీలు పక్కవారు వెళ్లి పట్టుకొనుటకు ప్రయత్నించగా పారిపోయినాడు.
బాధితురాలు ఫిర్యాదు మేరకు అప్పటి ఆదిలాబాద్ రెండవ పట్టణ ఇన్స్పెక్టర్ కే బుచ్చిరెడ్డి కేసు క్రైమ్ నెంబర్ 366/2014 సెక్షన్ 354 IPC 3(1)(XI) ఎస్సీ ఎస్టీ ఆక్ట్, ఎయిట్ ఫోక్సొ చట్టం కింద కేసు నమోదు చేయగా అప్పటి డిఎస్పి ఏ లక్ష్మీనారాయణ దర్యాప్తు చేసి చార్జిషీటు దాఖలు చేశారు.
ఇట్టి కేసులో ఇప్పుడున్న ఆదిలాబాద్ రెండవ పట్టణ సీఐ కే శ్రీధర్ కోర్టు డ్యూటీ అధికారియం శ్రీనివాస్ సాక్షులను ప్రవేశపెట్టగా, ప్రత్యేక పిపి ముస్కు రమణారెడ్డి 9 మందిని సాక్షులను విచారించి నేరం రుజువు చేయగా. శుక్రవారం ఫోక్సకోర్టు న్యాయమూర్తి డి మాధవి కృష్ణ తీర్పు వెలువరిస్తూ ముద్దాయియ్యగు మహమ్మద్ అజార్ ఖాన్ (40) తండ్రి.మహబూబ్ ఖాన్ కు సెక్షన్ 8 ఫోక్సో చట్టం కింద, 354 IPC కింద ఐదు సంవత్సరముల కఠిన కారాగార శిక్ష, సెక్షన్ 323 ఐపిసి కింద ఆరు నెలలు, సెక్షన్ 3 (1)(XI) ఎస్సీ ఎస్టీ చట్టం కింద ఒక సంవత్సరం, అన్ని నేరాలకు గాను రూ 5000/- జరిమానా విధించారు శిక్షలన్నీ ఏకకాలం గా అమలు పరచాలని తీర్పునిచ్చారు.
ఈ కేసులో ప్రత్యేక పిపి ముస్కు రమణారెడ్డిని కోర్టు డ్యూటీ అధికారి ఎం శ్రీనివాస్, కోర్టు లైసన్ అధికారి ఎం గంగా సింగ్ లను, జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు.
Recent Comments