జిల్లాలో కురుస్తున్న అధిక వర్షాలకు పంట నష్టం జరిగే ఆస్కారం ఉంది. ఈ క్రింది ముందు జాగ్రత్త చర్యలు పాటిస్తే నష్టాన్ని నివారించవచ్చు… : డా . శ్రీధర్ చౌహన్ , ప్రధాన శాస్త్రవేత్త ( ఆ.)
రిపబ్లిక్ హిందూస్థాన్, ఆదిలాబాద్ : ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు అనుగుణంగా వివిధ పంటలలో చేయవలసిన యాజమాన్య పద్ధతులు పీడన ద్రోణి వల్ల వర్షాలు అధికంగా కురుస్తున్నాయి. ఈ సందర్భంలో పంట రక్షణ కు తీసుకోవాల్సిన జాగ్రత్తలు , వాడాల్సిన మందులు
1. ప్రత్తి : ఆదిలాబాద్ జిల్లాలో ప్రస్తుతం ప్రత్తి పంట పూత కాత దశలో ఉంది . ఈ దశలో అల్ప అధిక వర్షాలు కురవడం వలన ముఖ్యంగా పారావిట్ తెగులు , ఎండుతెగులు ఆశించే అవకాశం ఉంది . పారావి తెగులు నివారణకు చేన్లలో నీరు నిలువ ఉండకుండా కాలువల ద్వారా నీటిని బయటకు పారదోలాలి . మొక్కలపై పిచికారి ఎరువులు 19 : 19 : 19 @ 10 గ్రా . ( లేదా ) 13 : 0:45 NPK @ 10 గ్రా . ( + ) పార్ములా -4 ( లేదా ) అగ్రోమిన్ మాక్స్ @ 5 గ్రా . లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి . ఎండు తెగులు నివారణకు కాపర్ ఆక్సిక్లోరైడ్ @ 3 గ్రా . ( + ) ప్లాంటోమైసిన్ @ 0.1 గ్రా . ( లేదా ) కాపర్ హైడ్రాక్సైడ్ @ 2 గ్రా . ( + ) ప్లాంటోమైసిన్ @ 0.1 గ్రా . లీటరు నీటికి కలిపి మొక్క మొదట్లో పోయావలెను . ఆకుమచ్చలు మరియు బాహ్య కాయకుళ్ళు నివారణకు క్రేసోక్సిమ్ - మిథైల్ @ 1 మి.లీ. ( లేదా ) పైరాక్లోస్ట్రోబిన్ @ 2 గ్రా . ( లేదా ) ప్రోపైనేట్ @ 2.5- గ్రా . ( లేదా ) పైరాక్లోస్ట్రోబిన్ ( + ) మెధిరామ్ @ 2 గ్రా . ( లేదా ) ప్రోపికోనజోల్ @ 1 మి.లీ. ( లేదా ) అజాక్సీ స్ట్రోబిన్ ( + ) డైఫెనోకోనజోల్ @ 1 మి.లీ. ( లేదా ) ప్లూక్సాపైరోక్సాడ్ ( + ) పైరాక్లోసైబిన్ @ 0.6 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి . అధిక వర్షాల వలన ప్రత్తిలో తెగుళ్ళతోపాటు కీటకాలు ఆశించే అవకాశం ఉండును . ముఖ్యంగా పచ్చదోమ ఆశించును . పచ్చదోమ నివారణకు ఎసిఫేట్ @ 1.5 గ్రా . ( లేదా ) ఇమిడాక్లోప్రిడ్ @ 0.25 మి.లీ. ( లేదా ) తయోమిథక్సామ్ @ 0.2 గ్రా . ( లేదా ) డైనుటోఫెరాన్ @ 0.3 గ్రా . లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి .
2. సోయాచిక్కుడు : సోయాబీన్ పంట కాయ మరియు గింజ తయారయ్యే దశలో ఉంది . ఈ దశలో ఆకుమచ్చ మరియు కాయకుళ్ళు తెగుళ్ళు ఆశించే అవకాశం ఎక్కువగా ఉండును . వీటి నివారణకు ప్లూక్సాపై రక్సాద్ ( + ) పైరాక్లోప్టోబిన్ @ 0.6 మి.లీ. ( లేదా ) పైరాక్లోస్ట్రోబిన్ ( + ) ఇపాక్సికోనోజోల్ @ 1.5 మి.లీ. ( లేదా ) టేబుకోనజోల్ ( + ) సల్ఫర్ @ 2.5 గ్రా . లీటరు నీటికి కలిపి పిచికారి చేయవలేను . ఈ దశలో పొగాకు లద్దె పురుగు కుడా ఆశించడం గమనించడమైనది . దీని నివారణకు స్పైనిటోరమ్ @ 0.9 గ్రా . ( లేదా ) ఇండాక్సాకార్చ్ @ 0.4 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి . లార్వా దశ 4 నుండి 6 వ దశ సైజులో ఉన్నట్లైయితే విషపు ఎరల ( 10 కేజి .
వరి తౌడు ( + ) 1 కేజి బెల్లం ద్రావణం ( + ) 250 మి.లీ. స్వీట్ ఆయిల్ ( + ) 300 గ్రా . థయోడికార్బ్ ) ను చిన్న చిన్న ఉండలుగా తయారు చేసుకొని సాయంత్రం పూట మొక్క మొదళ్ళ దగ్గర వేయవలెను .
3.కంది : కంది పంటలో కూడా ఎండుతెగులు , పోషక లోపాలు వచ్చే అవకాశం ఉండును . ఎండుతెగులు నివారణకు కాపర్ఆక్సిక్లోరైడ్ @ 3 గ్రా . ( + ) ప్లాంటోమైసిన్ @ 0.1 గ్రా . ( లేదా ) కాపర్ హైడ్రాక్సైడ్ @ 2 గా . ( + ) ప్లాంటోమైసిన్ @ 0.1 గ్రా . లీటరు నీటికి కలిపి మొక్క మొదల్లో పేర్లు తడిచేటట్లు పోయవలెను . పోషక లోపాలు సవరించడానికి 19 : 19 : 19 @ 10 గ్రా . ( లేదా ) 13 : 0:45 NPK @ 10 గ్రా . ( + ) పార్ములా -4 ( లేదా ) అగ్రోమిన్ మాక్స్ @ 5 గ్రా . లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి .
కావాల్సిన సమాచారం కోసం సంప్రదించవలసిన అధికారుల ఫోన్ నెంబర్లు
కె . రాజశేఖర్ , శాస్త్రవేత్త ( ఎంటమాలజి ) , వ్యవసాయ పరిశోధన స్థానం , ఆదిలాబాద్ . సెల్ నెం. 99085 56659
డా . శ్రీధర్ చౌహాన్ , ప్రధాన శాస్త్రవేత్త ( అగ్రినమి ) , వ్యవసాయ పరిశోధన స్థానం , ఆదిలాబాద్ సెల్ నెం : 7337399461
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments