ఆదిలాబాద్ : జిల్లాలో కానిస్టేబుల్ మరియు ఎస్సై అభ్యర్థులకు రెండవ విడత శారీరక దేహదారుఢ్య పరీక్షలు ఫిబ్రవరి 15 నుండి 17 వరకు నిర్వహించనున్నట్లు జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ దేహదారుడ్య పరీక్షలకు సంబంధించి ఎటువంటి లోటుపాట్లు లేకుండా, గత నెలలో చేసిన శారీరక దేహదారుద్య పరీక్ష ప్రక్రియ అనుభవంతో ఈసారి ఎంపిక ప్రక్రియను మరింత పకడ్బందీగా ఏర్పాట్లను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో గల పోలీస్ హెడ్ కోటర్స్ నందు పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్సై అభ్యర్థులకు శారీరక దేవదారుడ్య పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలియజేశారు. మహిళా అభ్యర్థులకు ప్రత్యేకంగా 16 వ తారీకులో శారీరక దేహదారుడ్య పరీక్షలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎక్కడ ఎలాంటి అవకతవకలకు విమర్శలకు తావు లేకుండా శారీరక పరీక్షలు జరిగే మైదానంలో సీసీ కెమెరాలు నిఘా ఉంచుతున్నామని తెలిపారు. అభ్యర్థుల ఎత్తు కొలిచేందుకు డిజిటల్ మీటర్లు ఉపయోగిస్తున్నారని, పురుష అభ్యర్థులకు 1600 మీటర్లు పరుగు కు, మహిళా అభ్యర్థులకు 800 మీటర్ల పరుగు కు ఆర్ ఎఫ్ ఐ డి (రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ రీడర్) కార్డులను ఉపయోగించి అత్యాధునిక పరికరారులతో ఆటోమేటిక్గా సమయాలన్ని రికార్డు నమోదు అయ్యేవిధంగా యంత్రాలను ఉపయోగిస్తున్నట్లు. అభ్యర్థులు మాత్రమే పరీక్షలకు హాజరు అయ్యే విధంగా రిస్ట్ బ్యాండ్లను ఉపయోగించన్నున్నట్లు తెలిపారు. షాట్ పుట్ లాంగ్ జంప్ ఈవెంట్స్ ల నందు క్వాలిఫై మేరకు మాత్రమే నమోదు చేయబడుతుందని, పరుగులో మాత్రం అభ్యర్థికి మార్కులను కేటాయించనున్నట్లు తెలిపారు. ఈ వ్యవహారం అంతా ఆన్లైన్ ద్వారా ఎప్పటికప్పుడు రాష్ట్ర పోలీసు నియామక మండలి బోర్డ్ సర్వర్లోకి అప్లోడ్ అవుతుందని తెలిపారు.
ఉదయం 4 గంటలకు పరీక్ష ప్రారంభమవుతుందని,
ఇందులో ఉత్తీర్ణలైన వారు తదుపరి తుది రాత పరీక్షకు ఎంపికవుతారు. మైదానంలో అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కల్గకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. సర్టిఫికేట్ పరిశీలన నుంచి దేహదారుఢ్య పరీక్షల వరకూ వినూత్న రీతిలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడంతో ఎలాంటి అక్రమాలకు ఆస్కారం లేకుండా పక్కా ప్రణాళికతో నిర్వహించనున్నారు.
మోసపూరిత మాటలు నమ్మొద్దు
పోలీస్ ఎంపిక ప్రక్రియ మొత్తం పారదర్శకంగా కొనసాగుతోందని ఎవరైనా అక్రమ మార్గంలో మేలు చేస్తామని చెబితే నమ్మి మోసపోవద్దని జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రతి అంశం టెక్నాలజీతో ముడిపడి ఉంటుందని, ఎక్కడా మానవ ప్రమేయం ఉండదని అన్నారు. ప్రతి బ్యాచ్ ఎంపిక ప్రక్రియ జరిగే సమయంలో ప్రతి అంశం సీసీ కెమెరాల్లో రికార్డు అవుతుందని, దాన్ని భద్రపరుస్తామని తెలిపారు. భవిష్యత్తులో ఏవైనా విమర్శలు వస్తే ఫుటేజీ ఆధారంగా విచారణ చేపడతారని అన్నారు. వేలిముద్రలు తీసుకున్న తర్వాతే అభ్యర్థుల్ని గ్రౌండ్‌లోకి అనుమతిస్తారని, పరేడ్ గ్రౌండ్స్ నందు లాకర్లు లేని కారణంగా అభ్యర్థులు ఫోన్లు, ఇతర వస్తువులను తీసుకురావద్దని, వాటిని భద్రపరిచేందుకు ఎలాంటి ఏర్పాట్లు ఉండవని అధికారులు తెలిపారు.
ఉదయం 4 గంటలకు హజరైన అభ్యర్థులకు మైదానంలో ఎలాంటి అసౌకర్యం కల్గకుండా ముందస్తు చర్యలలో భాగంగా శామినాలు (టెంట్స్), ప్రభుత్వ డాక్టర్ ఆద్వర్యంలో మెడికల్ క్యాంప్, అత్యవసర సమయంలో అంబులెన్స్, టాయిలెట్స్, మంచినీటి సాదుపాయం కల్పించారు.
పరీక్షలు నిర్వహించే పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ చుట్టూ ఎవరు ఇతరులు ప్రవేశించకుండా పోలీసు సిబ్బంది ద్వారా బందోబస్తు చర్యలను చేపట్టనున్నట్లు తెలిపారు.
కానిస్టేబుల్ మరియు ఎస్.ఐ శారీక దేహదారుఢ్య పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఈ క్రింది సూచనలు తప్పకుండా పాటించాలని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి గారు తెలిపారు.
🔹 రాష్ట్రస్థాయి పోలీస్ నియామక మండలి వారు జారీ చేసిన అనుమతి / సమాచార పత్రం ( admit card / intimation letter ) తమ వెంట తీసుకురావాలి.
🔹 అనేక్సర్ 2 (annexure 2) కచ్చితంగా తీసుకొని రావాలి.
🔹 అభ్యర్థి స్వీయా సంతకముతో కూడిన పార్టు 2 అప్లికేషన్ ఫామ్
🔹 తమ స్వీయా సంతకాలతో కూడిన కుల ధ్రువీకరణ పత్రం నకలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంచే జారీ చేయబడి ఉండాలి.
🔹 అభ్యర్థి సీయా సంతకము కలిగిన మాజీ సైనిక దృవ పత్రం ( PPT / డిచార్జీ బుక్ ) /నో అబ్జెక్షన్ సర్టిఫికేటు ( ఇంకా సర్వీసు నుండి డిచార్జీ కానివారికి)
🔹 అభ్యర్థి స్వీయా సంతకముతో కూడిన ఏజన్సీ ఏరియా సర్టిఫికేటు ఫర్ ఆదివాసి, షెడ్యూల్డు తెగ G.O. MS 24, ట్రైబల్ వెల్ఫేర్ ( LTR 1 )
డిపార్టుమెంటు తేది: 12-06-2018 ప్రకారంగా జారీచేయబడింది.
🔹 ప్రతీ అభ్యర్థి సి.సి కెమెరాల నిఘాలో ఉంటారు.
🔹 అభ్యర్థులు వారికి ఉద్దేశించిన తేదీలలో మాత్రమే శారీరక మరియు దేహాదారుఢ్య పరీక్షలకు హాజరు కాగలరు.
🔹 అభ్యర్థులు పరీక్ష నిర్వాహాణ కేంద్రంలోకి ప్రవేశించిన తరువాత అన్ని రకాల పరీక్షలు ముగిసిన తరువాతనే బయటకు అనుమతిస్తారు. కావున అభ్యర్థులు అందుకు తగిన విధంగా సంసిద్ధులై రాగలరు.
🔹 పరీక్ష కేంద్రం వద్ద లాకర్లు లేని కారణంగా అభ్యర్ధులు తమ వెంట దుస్తులు ఆహార పానీయాలు వంటి అత్యవసరమైనవి మినహా ఎటువంటి విలువైన లేదా నిషేదిత వస్తువులు పరీక్ష కేంద్రంలోకి అనుమతించబడవు.
🔹 అభ్యర్థులు ప్రతీ ఈవెంట్ వద్ద మరియు పరిశీలన కేంద్రాల వద్ద ఓర్పుతో ” క్యూ ” పద్ధతిని
పాటించాలి
🔹 సెల్ఫోన్లు మరియు ఎటువంటి ఎలక్ట్రానిక్స్ వస్తువులు అనుమతించడబవు.
🔹 మహిళా అభ్యర్థులు తమ వాస్తవిక ఎత్తును ప్రభావితం చేయు ఎలాంటి అభ్యంతరకర శిరోజాలం కరణలు ధరించి పరీక్షకు హాజరుకారాదు.
🔹 బయోమెట్రిక్ పద్దతిలో అభ్యర్థుల పరిశీలన ఉన్నందున చేతి వేళ్లకు గోరింటాకు లేదా ఇతర
రంగులు వేసుకుని రాకూడదు.
🔹 పరీక్ష నిర్వాహణలో ప్రతి అభ్యర్థి అధికారుల సూచనలు పాటిస్తూ సహకరించవలెను.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments