జైనూర్ సంఘటన కు నిరసనగా శుక్రవారం బంద్.
Thank you for reading this post, don't forget to subscribe!రిపబ్లిక్ హిందూస్తాన్,బజార్ హత్నూర్,
జైనూర్ సంఘటనకు నిరసనగా శుక్రవారం రోజున ఆదివాసి సంఘాలు బజార్ హత్నూర్ మార్కెట్ బంద్ పాటించాలని గురువారం పిలుపు ఇచ్చారు.
ఆగస్టు 31రోజున మా ఆదివాసి మహిళ తన కుటుంబ సభ్యుల ఇంటికి రాఖి కట్టడానికి ఆటో ఎక్కి వెళుతున్నది.
ఆ సమయంలో ఎవ్వరు లేని నిర్మానుశ్యoగా ఉన్న ప్రాంతంలోకి ఆటో డ్రైవర్ షేక్ మగ్గుదుం ఆటోను ఆపివేసి బలవంతంగా లాక్కెళ్ళికొట్టి అత్యాచారం చేసి హత్య చేసి చనిపోయిందని నిర్ధారించుకొని
వదలి వెళ్లిన సంఘటన నేపథ్యంలో ఈ బంద్ జరుపుతున్నట్లు తెలిపారు.అక్కడ వదలిన ఆదివాసి మహిళ కొన ఊపిరితో పోరాడుతూ రోడ్డుపైకి వచ్చింది.అక్కడి నుండి స్థానికుల సహాయంతో ఉట్నూర్ ఆసుపత్రి కి అక్కడి నుండి ఆదిలాబాద్ రిమ్స్ కు రిమ్స్ నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు రెఫర్ చేశారు.ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో ఉంది.జైనూరుకు చెందిన మాగ్దూం పై ఎస్సి,ఎస్టీ అట్రాసిటీ అత్యాచారం కేసు నమోదు చేసి వెంటనే ఉరిశిక్ష విధించాలని ఆదివాసీ తొమ్మిది తెగల సoఘాలు తరుపున డిమాండ్ చేస్తున్నామని తెలుపుతూ నిందితుని కుటుంబాన్ని జైనూర్ గ్రామం నుంచి శాశ్వతంగా ఖాళీ చేసి శిక్ష విధించాలని కోరారు.షేక్ మగ్దూం గతంలో కూడా ఒక ఆదివాసి మహిళను మోసం చేసి వాడుకొని వదిలేశాడని ఇలాంటి వారికి శిక్ష పడాల్సిందే
అని డిమాండ్ చేశారు.
బజార్ హత్నూర్ మండలంలో శుక్రవారం బంద్కు అనుబంధ ఆదివాసీ తొమ్మిది తెగల సంఘాలు, మండల, డివిజన్, జిల్లా,రాష్ట్ర కమిటీ సభ్యులు బజార్ హత్నూర్ మండలానికి తరలి వచ్చి రేపటి బంద్కు పూర్తిగా మద్దతు తెలిపి బంద్ లో పాల్గొనాలని బజార్ హత్నూర్ ఆదివాసీ నాయకులు ప్రకటన ద్వారా తెలిపారు.ఆదివాసితొమ్మిది తెగల సంఘoలు, జిల్లా, రాష్ట్ర కమిటీ తరపున విజ్ఞప్తి చేశారు.
Recent Comments