దాడిలో ఇద్దరు చిన్నారుల మృతి…
పాక్ ను హెచ్చరించిన చైనా….
రిపబ్లిక్ హిందూస్థాన్ : పాకిస్థాన్ లో శుక్రవారం చైనా దేశస్థుల వాహనం పై బాంబు దాడి జరిగింది. చైనా పౌరులు లక్ష్యంగా రెండో సారి ఆ దేశంలో దాడి జరగడం తో పాక్ లోని చైనా రాయబారి కార్యాలయం పాక్ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీచేసింది. విచారణ వేగవంతం చేసి నిందితులను పట్టుకోవాలని ఆదేశించారు.

భవిష్యత్తు లో ఇలాంటి ఘటన లు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత పాకిస్థాన్ పై ఉందని చైనా అధికారులు పేర్కొన్నారు.
బలుచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఈ ఆత్మాహుతి దాడికి పాల్పడినట్లు ధ్రువీకరించారు.
పాకిస్థాన్ లో ఉన్న చైనా జాతీయులు ఎవరు కూడా బయట తిరగకూడదని , జాగ్రత ఆ దేశ రాయబార కార్యాలయం ఆ దేశ పౌరులను సూచించింది.


Recent Comments