బాధ్యులపై వెంటనే కఠినమైన చర్యలు చేపట్టాలి
*ఆదివాసి సేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కోవ దౌలత్ రావు మొకాశి డిమాండ్
రిపబ్లిక్ హిందుస్థాన్ , జైనూర్ :
సోమవారం రోజు కుంరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల కేంద్రములో రెండు వర్గాల మధ్య ఘర్షణ పేరుతో ఆదివాసి యువకుడిపై దాడి చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. అధికారులు తక్షణమే స్పందించి బాధ్యులపై వెంటనే తగిన కఠినమైన చర్యలు చేపట్టక పోతే ఆదివాసి సంఘాలన్నీ కలసి తీవ్ర ఆందోళనకుదిగాల్సి వస్తుందని ఆదివాసి సేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కోవ దౌలత్ రావు మొకాశి హెచ్చరించారు.
Recent Comments