20 ఏళ్లుగా తమకాలనిలలో అభివృద్ధి చేయడం లేదని ధర్నా కు దిగిన కాలనీ వాసులు…
రోడ్ల దుస్థితి ఫోటోల ఫ్లెక్సీ చేసి ధర్నా…
రిపబ్లిక్ హిందూస్థాన్, ఇచ్చొడా : ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం కేంద్రంలో గ్రామపంచాయతీ పరిధిలోని ఇస్లాంపూర్ రంజాన్ పుర కాలనీ వాసులు ధర్నాకు దిగారు.

గత 20 ఏళ్లుగా తమకాలనీలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయడం లేదని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు.
మండల కేంద్రంలోని అంబెడ్కర్ చౌరస్తాలో ధర్నాకు దిగిన కాలనీ వాసులు తమ డిమాండ్లను నెరవేర్చే వరకు కదిలేది లేదని , తమకు న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని తెలిపారు. స్థానిక ఎస్ఐ ఫరీద్ వారిని సముదాయించే ప్రయత్నం చేసిన విన లేదు . ఎమ్మెల్యే డౌన్ డౌన్, సర్పంచ్ డౌన్ డౌన్, ఎంపీపీ డౌన్ డౌన్ అనే నినాదాలతో హోరెత్తించారు. కాలనిలో ఉన్న మురికి రోడ్ల ఫోటో తీసి వినూత్నంగా ఫ్లెక్సీ ఏర్పాటు చేసి తమ నిరసన తెలిపారు.

తమ కాలనీ సమస్యలు పరిష్కరించే వరకు కదిలేది లేదని తెలిపారు .
ఎంపిఓ వచ్చి రెండు రోడ్లకు త్వరలో పనులు షురూ చేస్తానని హామీ ఇవ్వడంతో ధర్నా ముగించారు.


Recent Comments