★ ‘పెన్ను’పై గన్ను
★ భావప్రకటన స్వేచ్ఛ..?
★ అణిచివేత తర్వాత విస్పోటం
◆ నిర్భయంగా రాసే జర్నలిస్టులు ఎంత మంది.?
◆ మూతపడ్డ చిన్న, మధ్య తరగతి పత్రికలు
◆ బజారున పడ్డ జర్నలిస్టు కుటుంబాలకు దిక్కెవరు.?
◆ ప్రకటనల ముసుగులో రూ.500 కోట్లు.!

రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, న్యాయం, భావ ప్రకటన స్వేచ్ఛ రంగాలలో ఉన్న అవినీతిని నిలదీసి, నిగ్గదీసి ప్రశ్నించటమే జర్నలిజం. అది గవర్నర్లు, న్యాయాధీశులు, రాజకీయ నాయకులు, పత్రికాధిపతులు ఎవరైనా ఒకటే. అవినీతి రాజ్యమేలుతున్న వేళ జర్నలిస్టులు నిజాలు చెపుతున్నారా.?
జర్నలిజం విలువలకు కట్టుబడే జర్నలిస్టులు వార్తలు రాస్తున్నారా..? అధికార పార్టీకి భయపడి భయం భయంగా కాలం వెళ్ళదీస్తున్నారా..? సామాన్యుడికి న్యాయం జరగాలనే లక్ష్యంతో పాత్రికేయులు పనిచేస్తున్నారా..? వ్యవస్థలపై నమ్మకం సామాన్యులకు ఉందా.? అభ్యంతరాలు వ్యక్తం చేసే పరిస్థితి తెలంగాణలో ఉందా.? ఆ,యా రంగంలో వేళ్ళూనుకున్న అవినీతి, అక్రమార్కులు ఎంతగా బరి తెగించారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలంగాణలో ‘ఫొర్త్ ఎస్టేట్’ జర్నలిజం నిజాయితీగా పని చేస్తుందా.? జర్నలిస్టులు తమ కథనాలలో ప్రశ్నిస్తున్నది వ్యక్తులను కాదు. వారు చేసిన తప్పుడు విధానాలను మాత్రమే. రాజకీయ ముసుగులో జరుగుతున్న అరాచకీయాన్ని తీవ్ర స్వరంతో ప్రశ్నించాల్సిందే.! తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షం లేదు. పేదోడి పక్షాన ప్రశ్నించే గొంతు లేదు. ప్రత్యర్థి పార్టీలు ‘సీజన్ వారీ ధర్నా’లకే పరిమితం. ప్రజాప్రతినిధిలు ప్రమాణస్వీకారంలో చెప్పిన ‘అతఃకరణ శుద్ది’ని పాటిస్తున్నారా.?
తెలంగాణాలో…:
మలి ఉద్యమంలో పన్నెండు వందలమందికిపైగా ఆత్మ బలిదానాలతో సిద్దించిన తెలంగాణ. మాటల మాటున ఏ రాబందులు.? ఎలా కోట్లు దండుకున్నారు…! ఎట్టకేలకు ఓ కుటుంబం , ఆ కుటుంబ సభ్యులు చేసిన నిర్వాకం. నిజస్వరూపం బట్టబయలు. ఆధారాల కోసం తవ్వడం మొదలెడితే… ఎన్నో భిన్న కోణాలు. ఊహించని మలుపులు, డొల్ల కంపెనీలు. స్పీడ్ బ్రేకర్లు లేని ఆదాయం. అందులోనూ ‘కలం’ పట్టని మహిళలను అడ్డుగా పెట్టుకొని కోట్లు తరలించుకుపోయారు.
‘నమస్తే’ మాటున ‘గుమస్తా’గిరి.!:
అక్షర సత్యంగా చెపితే… ఆ దారుణం జరిగిందని చెపితే.. గుమస్తాగిరి చేస్తూ.. కేసుల పరంపర ‘సంస్కృతి’గా.. జర్నలిస్టులకు శాపంగా మారింది. ఆ కోట్లాది రూపాయల కుంభకోణం… సంక్షేమ పథకాల ముసుగులోనూ, కాంట్రాక్టు ముసుగులోనూ, కమీషన్ల రూపంలోనూ.. అప్పుల తెలంగాణా మార్చారు. జర్నలిజం ముసుగులో చక్కాగా, పక్కగా, పకడ్బందీగా నిఖార్సయిన ‘ఫోర్త్ ఎస్టేట్’లో నిర్భయంగా, నిర్భీతిగా, నిసిగ్గుగా, నిస్సంకోచంగా జరిగింది.
వీళ్ళందరూ భాగస్వామ్యులే..!:
ప్రభుత్వంలో జరిగిన, జరుగుతున్న అవినీతి, అక్రమాలు
‘మెయిన్ స్ట్రీమ్ మీడియా’కు తెలియంది కాదు. ఆ బాగోతాలలో పరోక్షంగా అందరూ భాగస్వామ్యులే.! వాళ్ళకు వారి వ్యాపారాలే ముఖ్యం. అందుకే వారు నోరు మెదపరు. మెదపలేరు. ఈ దొంగ దొరల ముసుగులాటలో వైభవంగా నిరంతరాయంగా నిజాలు రాసే జర్నలిస్టులకు జైళ్ళ జీవితాలను ప్రసాదంలా అందిస్తున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది అవాంఛనీయం. అనంతర విస్ఫోటనం అంతే భయంకరంగా ఉంటుంది.
మూతపడ్డ చిన్న పత్రికలు:
నిబంధనల మేరకు ఏడాదికి ఓ లక్ష రూపాయల ప్రభుత్వ ప్రకటనలు ఇస్తే నడిచే చిన్నా, మధ్య తరగతి పత్రికలు ఎన్నో ఉన్నాయి. కనీసస్థాయిలో ఆ ప్రకటనలు కూడా అందక బంగారు తెలంగాణలో బజారున పడ్డ వందలాది చిన్నా.. చితక పత్రికలు ఎన్నో ‘మూతపడ్డాయి’ అనే కంటే… “తేనె పూత లాంటి కుట్ర” జరిగిందంటే బాగుంటుంది. కేవలం పదుగురు… అదీ కార్పోరేట్ శక్తుల మద్య(0) చేతిలో నలుగుతున్న సగటు జర్నలిస్ట్ భవితవ్యం ఏమిటి..? చిన్న పత్రికలు నడిపే నిఖార్సయిన పాత్రికేయుల జీవిత గమనం.. బంగారు తెలంగాణలో ఎవరి చేతిలో జర్నలిజం బలిపీఠం ఎక్కించారు.
ప్రకటనల ముసుగులో రూ.500 కోట్లు.!:
కనీసం ప్రశ్నించే గొంతుకలను ‘జీఓ’ల ముసుగులో సమాధి కట్టారు. అర్థరాత్రి కాదు పట్టపగలే స్మశానవాటికలో సంబరాల మధ్య భయంకరంగా… ఒకటి కాదు.. రెండు కాదు… ఏకంగా రూ.500 కోట్లు.. అక్షరాల ఐదు వందల కోట్ల రూపాయలు అధికారం మాటున గుంభనంగా ఆరగించారు. పదిహేను సంవత్సరాల క్రితం వరకు ఐటి (ఇన్ కం టాక్స్.. అదే ఆదాయపన్ను) కట్టే స్థోమత లేదు. కానీ నేడు వందల కోట్లు ఎలా.? ఏ విధంగా.? ఎక్కడ పనిచేసి సంపాదించారు. పెన్ను పెట్టు కోకుండా… రాయడం చేతగాని వాళ్ళు… అదీ మహిళల పేరుతో… ఏకంగా వందల కోట్లు ఎలా సంపాదించారు..? జర్నలిజం ముసుగులో సగర్వంగా, సగౌరవంగా, సవినయంగా జరిగిన ఈ అధ్భుతమైన కుంభకోణాల గురించి ఎవరు మాట్లాడాలి.? మాట్లాడితే ‘పెన్ను’పై గన్ను పేల్చడానికి సిద్దం.
ముగింపు:
పాత్రికేయులారా..?
నేడు ‘తీన్మార్ మల్లన్న’. రేపు మరొకరు. నిజంగా మనం అదరం నిజాయితీగా వార్తలు రాస్తున్నామా..? కనీసం నెలకు ఒక్కరోజు అయినా.. తెలంగాణ రాష్ట్రంలో నిజాలను నిర్మొహమాటంగా రాస్తే అక్రమార్కుల పరిస్థితి, దుస్థితి ఎలా ఉంటుంది.? ఒక్కసారి ఆలోచిద్దాం. రండి.
విశ్లేషకులు : ( ప్రముఖ పరిశోధన పాత్రికేయులు, తెలంగాణరాష్ట్ర జర్నలిస్టుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు అనంచిన్ని వెంకటేశ్వరరావు అందిస్తున్న ప్రత్యేక కథనం)
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments