— కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పథకాలకు ఆకర్షితులై….
— కెసిఆర్ పాలన పై యువత అసహనం
— బిజెపి రాష్ట్ర నాయకుడు మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి
రిపబ్లిక్ హిందుస్థాన్, నల్లబెల్లి : భారతీయ జనతా పార్టీ వైపు యువత చూస్తోందని, అందుకే పార్టీలోకి వలసలు ప్రారంభమైనట్లు బిజెపి రాష్ట్ర నాయకుడు మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు. ఆదివారం నల్లబెల్లి మండలం ధర్మారావు పల్లి గ్రామానికి చెందిన వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు నర్సంపేట పట్టణం లోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో బిజెపి రాష్ట్ర నాయకుడు రేవూరి ప్రకాశ్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పథకాలకు యువత ఆకర్షితులై, మరియు కెసిఆర్ పాలన పై విసుగు చెంది పార్టీలో చేరుతున్నారని పేర్కొన్నారు. దేశంలోని అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి బిజెపి కృషి చేస్తోందన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా సమస్యలను విస్మరించిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో దళిత మోర్చా జిల్లా అధ్యక్షుడు సుదర్శన్, మండల ప్రతాప్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి బొట్ల పవన్, ఉపాధ్యక్షుడు ఐలయ్య, వేముల రాజు తదితరులు పాల్గొన్నారు.
Recent Comments