రిపబ్లిక్ హిందుస్థాన్, విజయవాడ : విజయవాడలోని కృష్ణలంక రణదివేనగర్ లో ఓ యువతి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. విజయవాడలోని పీబీ సిద్ధార్థ కళాశాలలో ప్రత్యూష(22) అనే అమ్మాయి ఎంబీఏ మొదటి సంవత్సరం చదువుతోంది. అయితే ఇంట్లో ఎవరు లేని సమయంలో ప్రత్యూష ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న ప్రత్యూష కుటంబ సభ్యులు, స్థానికులు ఒక్కసారిగా కంగుతిన్నారు. పోలీసులకు సమాచారం అందించగా ప్రత్యూష సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అయితే ప్రత్యూష ఎందుకు ఇలా ఆత్మహత్య చేసుకుందోనన్న విషయంపై మాత్రం ఇంతవరకు స్పష్టత లేదు. ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనపై విచారిస్తున్నారు. కన్నకూతురు ఇంట్లో ఆత్మహత్య చేసుకోవడంతో ప్రత్యూష తల్లిదండ్రులు, బంధుమిత్రులుకన్నీరుమున్నీరవుతున్నారు….
AP : ఇంట్లో ఉరేసుకుని యువతి ఆత్మహత్య
Thank you for reading this post, don't forget to subscribe!
Previous article
Next article


Recent Comments