రిపబ్లిక్ హిందుస్థాన్, అదిలాబాద్ :
మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా బుధవారం స్థానిక ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి జిల్లాలోని మహిళా ఉద్యోగుల మరియు సిబ్బందినిల సమక్షంలో ప్రత్యేకంగా మహిళా దినోత్సవ వేడుకలను కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ జిల్లాలోని మహిళలకు మహిళ పోలీసు అధికారులకు ఉద్యోగులకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ మొదటగా మహిళా అధికారులకు వృత్తిపరంగా గాని సొంతంగా గాని ఎటువంటి సమస్యలు ఉన్న వాటిని పరిష్కరించేందుకు ఎల్లవేళలా జిల్లా పోలీస్ యంత్రాంగం అందుబాటులో ఉండి ఖచ్చితమైన సహాయాన్ని అందజేస్తామని హామీ ఇచ్చారు. అలాగే మహిళ అధికారులు వృత్తిపరంగా సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన పనితనాన్ని పెంపొందించుకొని పోలీసు కార్యాలయంలో, పోలీస్ స్టేషన్ల లో విధులు నిర్వర్తించేలా ఉండాలని తెలిపారు. మహిళలు కార్యాలయాలలో విధులు నిర్వర్తించినప్పుడు మిగిలిన సిబ్బంది ని వివిధ రకాలైన కఠినమైన విధులకు హాజరయ్యేలా ఆస్కారం ఉంటుందని తెలియజేశారు.
అదేవిధంగా మహిళలు పురుషులకు ఏమాత్రం తక్కువగా కాకుండా అన్ని అన్ని రకాల కష్టతర విధులను సక్రమంగా నిర్వర్తిస్తున్నారని ప్రశంసించారు. దేశ భవిష్యత్తు రేపటి యువతపై ఉన్న కారణంగా ప్రతి ఒక్కరూ కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు ఎదగాలని కోరుతూ మహిళా సిబ్బందితో తమ పిల్లల భవిష్యత్తుపై ప్రత్యేక శ్రద్దను పాటిస్తూ ఉన్నత చదువులు చదివేల ప్రోత్సహించాలని తెలియజేశారు. సిబ్బంది పనితనాన్ని మెచ్చుకుంటూ ఎటువంటి నిర్లక్ష్యపు విధులను చేయకుండా జిల్లా పోలీసు పేరును పెంపొందించే విధంగా విధులను నిర్వర్తించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంటిఓ బి శ్రీపాల్, సీసీ దుర్గం శ్రీనివాస్, జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు పెంచాల వెంకటేశ్వర్లు, మహిళ ఎస్సైలు డి రాధిక, అంజమ్మ,పద్మ ఏఎస్ఐలు సునీత, అనిత, సవిత, కవిత, వెంకటమ్మ, మహిళా హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుళ్లు, హోంగార్డ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments