నల్లబెల్లి, రిపబ్లిక్ హిందుస్థాన్: మండల కేంద్రంలోనీ గ్రామపంచాయతీ కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, నియోజకవర్గ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్లెక్సీలకు రాఖీ కట్టి మహిళలు అభిమానం చాటుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీపీ ఊడుగుల సునీత ప్రవీణ్ గౌడ్ మాట్లాడుతూ మహిళలు మహిళలను అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర మహిళలకు పెద్దన్న లాంటి వారనీ అన్నారు. ఈ శాసన సభ బడ్జెట్ సమావేశాల్లో మహిళా సాధికారతకు పెద్ద పీట వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు రాజా రాం, గోనే శ్రీదేవి మండల పరిషత్ కో ఆప్షన్ సభ్యులు ఎండి నజీమా, మహిళా సమాఖ్య అధ్యక్షురాలు ఊటుకూరి భాగ్యలక్ష్మి, కార్యదర్శి కె అనూష కోశాధికారి రమ, పావని,లక్ష్మి సువర్ణ శ్రీలత కల్పన సుమలత అనిత, కవిత, రమ తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు
RELATED ARTICLES
Recent Comments