రిపబ్లిక్ హిందుస్థాన్, రామకృష్ణాపూర్ (ఫిబ్రవరి 11 ) : రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్త తిమ్మాపూర్ లో నివాసముంటున్న మలుబాక జోష్నారాణి (45) అనే మహిళ ఆత్మహత్య కు పాల్పడిన ఘటన చోటుచేసుకుంది. ఏ ఎస్సై రజిత మరియు మృతురాలి తండ్రి తెలిపిన వివరాల ప్రకారం సత్యనారాయణ మరియు జోశ్న రాణి లు భార్యాభర్తలు. జ్యోష్ణారాని గృహిణి. కొన్నేళ్ల నుండి ఆరోగ్యం బాగాలేక బాధను అనుభవిస్తున్న ఆమె మానసిక క్షోభ గురై జీవితం మీద విరక్తి చెంది శనివారం రోజు ఉదయం 10:30కు ఎవరూ లేని సమయంలో ఇంట్లో సీలింగ్ ఫ్యాన్ కు ఉరి వేసుకొని చనిపోయింది. మృతురాలి గత నాలుగు, ఐదు సంవత్సరంల నుండి మతిస్థిమితం బాగాలేక మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ లోని ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స చేయిస్తున్నారు. భర్త సత్యనారాయణ ఆర్ కె పి ఓసి లో ఆపరేటర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈమెకు కొడుకు, కూతురు ఉండగా వాళ్లు విదేశాల్లో స్థిరపడ్డారు. జోష్నారాణి తండ్రి ముప్పిడి రాజయ్య ఇచ్చిన ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్టు అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ రజిత తెలిపారు.
Crime: జీవితం విరక్తి చెంది ఉరేసుకొని గృహిణి ఆత్మహత్య
Thank you for reading this post, don't forget to subscribe!
Recent Comments