టీడీపీ, జనసేన అభ్యర్థుల తొలి ఉమ్మడి జాబితా ప్రకటించారు. మొత్తం 118 మందితో ఫస్ట్ లిస్ట్‌ను రూపొందించారు. ఇందులో టీడీపీకి 94, జనసేనకు 24 సీట్లు కేటాయించినట్లు చంద్రబాబు, పవన్ కల్యాణ్ ప్రకటించారు.
Thank you for reading this post, don't forget to subscribe!టీడీపీకి కేటాయించిన 94 స్థానాలకు చంద్రబాబు అభ్యర్థులను ప్రకటించారు. అయితే, టీడీపీ అభ్యర్థుల తొలి జాబితాలో పలువురు సీనియర్లు పేర్లు కనిపించకపోవడం ఏపీ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా విజయవాడ వెస్ట్ నియోజకవర్గ టికెట్ ఆశిస్తున్న టీడీపీ సీనియర్ బుద్ధా వెంకన్న పేరు తొలి జాబితాలో కనిపించకపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
టీడీపీకి, అధినేత చంద్రబాబుకు వీరాభీమాని అయిన బుద్ధా వెంకన్న విజయవాడ వెస్ట్ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ నెల 18వ తేదీన బుద్ధా వెంకన్న ఏకంగా తన రక్తంతో చంద్రబాబుకు ఫ్లెక్సీకి రక్తతర్పణం చేసి వార్తల్లో నిలిచాడు. ఈ నేపథ్యంలో అంతా బుద్ధా వెంకన్న టికెట్ కన్ఫామ్ అనుకున్నారు. కానీ అనుహ్యంగా టీడీపీ ఫస్ట్ లిస్ట్‌లో బుద్దా వెంకన్న పేరు కనిపించకపోవడంతో ”పాపం బుద్దా.. రక్తతర్పణం చేసిన చంద్రబాబు కనికరించలే’ అని నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. మరీ తర్వాత జాబితాల్లోనైనా బుద్దా వెంకన్నకు టికెట్ దక్కుతుందో లేదా చూడాలి మరీ.
Recent Comments