*హత్య యత్నం చేసిన ఇద్దరు నిందితులకు ఐదు సంవత్సరముల కఠిన కారా గార శిక్ష మరియు చెరో వెయ్యి రూపాయల జరిమానా విధించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె ప్రభాకర్ రావు.*
*ఉపాధి హామీ డబ్బుల కోసం దారుణంగా హత్య యత్నం చేసిన ఇద్దరు నిందితులు*
*ఇలాంటి కఠినమైన శిక్షల వల్ల నేరాల శాతం తగ్గుముఖం పడుతుంది.*
*వివరాలలో*
బోరిగాం గ్రామము ఇచ్చోడా మండలం లోని శివరాత్రి రోజున నర్సమ్మ (50), తేది 20.04.24 రోజు అర్థ రాత్రి 2 గంటలకు ఇద్దరు నిందితులు 1. బొర్రా విజయ్ కుమార్ మరియు 2 షేక్ మీనాజ్ హైమద్ లు, నర్సమ్మ ఇంటికి వచ్చి తలుపు కొట్టి లేపి ఆమెకు కు వచ్చిన ఉపాధి హామీ డబ్బులు ఇవ్వుమని అడగగా డబ్బులు ఇవ్వనందున విజయ్ కుమార్ నర్సమ్మ చేతులు పట్టుకొనగా షైక్ మీనాజ్ తనదగ్గర ఉన్నా కత్తి తో మెడ కోస్తుండగాఆమె కేకలు వేసింది. కేకలు వినిపించడం వల్ల చుట్టూ పక్కవాళ్లు అక్కడికి రావడం గమనించి ఇద్దరు పారిపోయారు, నరసమ్మ ఆస్పత్రి నందు చికిత్స తీసుకొని ప్రాణాపాయం నుండి బయటపడింది. దీనికిగాను,
👉అప్పటి ఇచ్చోడా ఎస్ఐ జి. నరేష్ ఫిర్యాదును స్వీకరించి క్రైమ్ నెంబర్ 62/2024 u/sec 307 r/వర్క్ 34 IPC కింద కేసు నమోదు చేసుకుని, కేసు విచారణ జరిపి చార్జ్ షీట్ దాఖలు చేయగా, ప్రస్తుత లైసెన్ ఆఫీసర్ జి పండరి మరియు కోర్టు డ్యూటీ అధికారి బి.రవీందర్ రెడ్డి లు 10 మంది సాక్షులను కోర్టు నందు హాజరుపరచగా పి పి ఎం మధుకర్ గారు నేరాన్ని రుజువు చేయించగా
👉 *జిల్లా ప్రధాన న్యాయమూర్తి కే ప్రభాకర్* రావు గారు తీర్పును వెలువరిస్తూ ముద్దాయిలకు ఇద్దరికి *ఐదు సంవత్సరముల కఠిన కారాగార శిక్ష మరియు ఒకొక్కరికి ఒక వెయ్యి రూపాయల జరిమానా* విధించడం జరిగింది అని కోర్టు లైసెన్ అధికారి జి పండరి గారు తెలిపారు. నిందితుడికి శిక్ష పడడంలో మరియు జిల్లా పోలీసు యంత్రాంగం సాక్షులను ప్రవేశ పెట్టడంలో కేసు విచారణ చేయడంలో కృషి చేసిన సిబ్బందిని *జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపిఎస్* ప్రత్యేకంగా అభినందించారు.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments