తెలంగాణ : ఏప్రిల్ 15
మండలాలలోని ఏజన్సీ గ్రామాల్లో గిరిజనులు, గిరిజనేతర కుటుంబాలు శనివారం నుండి తునికాకు సేకరణ ప్రారంభించాయి. మండలంలోని 2 యూనిట్ల ద్వారా 25 వేల స్టాండర్డు బ్యాగుల లక్ష్యంగా అటవీశాఖ అధికారులు ఆకు సేకరణకు పిలుపునివ్వడంతో గ్రామాల్లో తునికాకు సేకరణతో కుటుంబాల్లో సందడి నెలకొంది. పనులు లేని వేసవిలో ఆకు సేకరణ పలు కుటుంబాలకు ఆదాయం సమాకూర్చుతుండడంతో పల్లె ప్రజలు తెల్లవారుజాము నుండే అడవులకు వెళ్లి ఆకు సేకరిస్తున్నారు. 50 ఆకుల కట్టకు ప్రభుత్వం రూ.1.25లు ఇస్తుండగా కాంట్రాక్టు వర్గాలు మరో 25 పైసలు కలిపి రూ.1.50లు ఇస్తుండడంతో ఒక్కో కుటుంబం రోజు 200-300 రూపాయల వరకు ఆదాయం పొందేలా ఆకు సేకరిస్తున్నారు. ఆకు సేకరణ ఇప్పటికే ఆలస్యం కావడంతో అడవుల్లోని ఆకు ముదిరి పనిరాకుండా పోయిందని ప్రజలంటున్నారు. ఏప్రిల్ నెలలో అటవీ అధికారులు తునికి ఆకు సేకరణ ప్రారంబిస్తే మరింత ఆకు లభ్యమై అధిక ఆదాయం లభింంచేదని వారంటున్నారు. సేకరించిన ఆకు కట్టలను కళ్లాల్లో కల్లేదార్లు చిన్న గున్నదని తీసివేయంతో తాము కొంత ఆదాయాన్ని నష్టపోతున్నామని ఏ రోజు కట్టలకు ఆరోజే డబ్బులు ఇస్తే తమకుఏ అవసరాలకు ఉపయోగపడుతుందని వారంటున్నారు. వారానికి ఒకసారి డబ్బులు ఇస్తామంటూ చిట్టీలు ఇచ్చే కళ్లేదార్లు చివరకు ప్రభుత్వం నుండి బోనస్ రాలేదంటూ తమ కష్టాన్ని దోచుకుంటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
TS : నేటి నుంచి తునికాకు సేకరణ
RELATED ARTICLES
Recent Comments