- తెరాస పార్టీకి సరైన గుణపాఠం చెప్పాలి
- 9 తెగల ఆదివాసీ సంఘాల ప్రకటన
- రిపబ్లిక్ హిందుస్థాన్, ఇచ్చోడ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ అభ్యర్థి గా పోటీ చేస్తున్న ఆదివాసీ మహిళ పెందుర్ పుష్పరాణి గెలుపు కోసం తొమ్మిది తెగల ఆదివాసీ సంఘాల నాయకులు నడుంబిగించారు.
శనివారం రోజు ఇచ్చోడ మండల కేంద్రం లో కొమురం భీం సమావేశం మందిరంలో జరిగిన పత్రిక విలేకరులతో సమావేశంలో తుడుం దెబ్బ రాష్ట్ర కార్యదర్శి కొడప నగేష్ మరియు మండల అధ్యక్షుడు ఆత్రం మహేందర్ లు మాట్లాడుతూ ఎమ్మెల్సీ అభ్యర్థి పెందుర్ , పుష్పరాణి గెలిపిద్దామని అన్నారు. ఆదిలాబాద్ జిల్లా ( ఉమ్మడి ) ఎంపిటిసిలు , ఎంపిపిలు , జడ్పిటిసిలు , మున్సిపాల్ కౌన్సిలర్లు , మరియు ప్రతిపక్ష పార్టీలు కలిసి పెందుర్ పుష్పరాణి ని గెలిపించాలని కోరారు.
భారత రాజ్యంగం దినోత్సవము రోజున ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన ఆదివాసి మహిళ అని చూడకుండా పెందూర్ పుష్పరాణి నామినేషన్ తిరస్కరించాడనికి ప్రయత్నించారని తెరాస నాయకుల పై మండి పడ్డారు.
ఆదివాసీ మహిళ నామినేషన్ ను టీఆరెస్ పార్టీ నాయకులు అవమాన పర్చడాన్ని చింతిస్తున్నమని అన్నారు . అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న ఆదివాసీ గ్రామాల అభివృద్ధికై పుష్పరాణీ గేలుపుకు మద్దతు భారతీయ జనత పార్టీ మరియు కాంగ్రెష్ పార్టీలు మద్దతునిచ్చినందుకు ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ తరుపున కృతజ్ఞతలు తెలిపారు .
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆది వాసిలు ఎక్కువగా ఉన్నందున ఈ ప్రభుత్వం ఏ ఆదివాసి కైన అవకాశం ఇచ్చి ఉంటే మేము మద్దతు పలికేవారమని అన్నారు . ఎమ్మెల్సీ అభ్యర్థి అయిన పెందూర్ పుష్పరాణి ని భారీ మెజరీటితో గెలిపించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఆదివాసి హక్కుల పోరాట సమితి ( 9తెగలు ) ఇచ్చోడ తుడుందెబ్బ మండల ఉపాద్యక్షుడు సిడం మురళీకృష్ణ , ఎంపీటీసీ మెస్రం దేవ్ రావ్ , సర్పంచ్ తోడనం భీం రావ్, సర్పంచ్ విశ్వానాద్ , జంగు, కుడమేత జంగు , జగపతి , సిడాం సునీల్ లు పాల్గొన్నారు.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments