పోలీస్ స్టేషన్ లో పని చేసే మహిళా సిబ్బందికి
Thank you for reading this post, don't forget to subscribe!- ప్రత్యేక విశ్రాంతి గదులు….
- బందోబస్తు లో ఇబ్బంది కలుగకుండా ప్రత్యేక మొబైల్ టాయిలెట్స్…
- మహిళా పోలీసుల సేవలు చాలా ఆదర్శవంతమైనవి —-ఎస్పీ ఎన్.కోటిరెడ్డి.
రిపబ్లిక్ హిందూస్థాన్, మహబూబాబాద్ జిల్లా : సమాజంలో మహిళలకు గొప్ప స్థానం ఉందని, వారిని గౌరవించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి పై ఉందని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ ఎన్.కోటిరెడ్డి అన్నారు. మహబూబాబాద్ జిల్లా పరిధిలో విధులు నిర్వహిస్తున్న మహిళా పోలీస్ సిబ్బందితో జిల్లా ఎస్పీ ఎన్.కోటిరెడ్డి గారు సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ …..
శక్తిసామర్ధ్యాలలో, అభివృద్ధిలో నిర్ణయాలలో ఆదర్శవంతగా కీర్తించబడే స్త్రీమూర్తి వంటింటికే పరిమితం కాకుండా భూగర్భం నుంచి అంతరిక్ష పరిశోధన వరకు మేటి విలువలతో విభిన్న రంగాల్లో తమకంటూ ప్రత్యేక గుర్తింపు కోసం అహర్నిశలూ కృషిచేస్తూ…. మేలైన విజయాలను సొంతం చేసుకుంటున్నారని అన్నారు.
ప్రతికూల పరిస్థితులను అధిగమించి, సహజ గుణాలనే శక్తియుక్తులుగా మార్చుకుంటూ..
పురుషులకు ధీటుగా అన్ని రకాల వ్యవస్థలను నడిపే శక్తిగా… ఉజ్వల భవిష్యత్ కు పునాది వేసేందుకు మహిళలు కృషి చేస్తున్నారని అన్నారు.
తల్లిగా, సోదరిగా, భార్యగా, గృహిణిగా ఉద్యోగిగా విజయవంతం కావడంలో మహిళలో వున్న సహనం, ఓర్పు కారణమని అన్నారు. ఈ సహనాన్ని ఆవకాశంగా మలచుకొని ఉన్నత శిఖరాలను ఆధిరోహించాలని సూచించారు.
పూర్వకాలంలో ఆడపిల్ల వున్నా లేకపోయినా ..అబ్బాయి మాత్రం వుండాలని కుటుంబాలు కోరుకునేవని కానీ
తాజాగా జరిగిన సర్వేలో తల్లిదండ్రుల పట్ల అమ్మాయిలు తీసుకునే శ్రద్దను దృష్టిలో పెట్టకొని అబ్బాయి వున్నా లేకున్నా అమ్మాయి ఖచ్చితంగా వుండాలని తల్లిదండ్రులు కోరుకుంటున్నారని అన్నారు.
మహిళలు తమకు ఉన్న అన్ని సమస్యలు పోలీస్ స్టేషన్ కి వచ్చి చెప్పుకోలేని స్థితిలో ఉంటారని, అలాంటి వారికి షీ టీం అండగా ఉంటూ రక్షణ కల్పించడం జరుగుతుంది అన్నారు. ముఖ్యంగా యువత, విద్యార్థినులు తమ భద్రత కోసం డయల్ 100, షీ టీమ్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని, అత్యవసర సమయంలో పోలీసులకు ఫోన్ చేస్తే 5-10 నిమిషాల్లో బాధితుల వద్దకు చేరి సహాయం అందిస్తున్నారని తెలిపారు. మహిళలపై అత్యాచారాలు, దాడులకు సంబంధించిన కేసులలో నిందితులకు చట్టప్రకారం శిక్ష పడేలా తెలంగాణ పోలీసులు పోక్సో, నిర్భయ చట్టాలను పకడ్భందిగా అమలు చేస్తున్నట్లు తెలిపారు.
Recent Comments