రిపబ్లిక్ హిందూస్తాన్ , ఆదిలాబాద్ : శుక్రవారం రోజున ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ మరియు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ ఏర్పాటు ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షులు గోడం నగేష్ మాట్లాడుతూ.. భారత ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మూడు రైతు నల్ల చట్టాలను రద్దు చేసినట్లు ప్రకటించడం, రైతుల విజయంగా మేం భావిస్తున్నామని అన్నారు. రైతులు చాలా రోజుల నుండి మూడు నల్ల చట్టాలకు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ, రైతు పోరాటాలు చేస్తున్నారు.
దీనితో భారత ప్రభుత్వం ఉద్యమాలకు తలవొగ్గి మూడు నల్ల చట్టాలను భేషరతుగా రద్దు చేయడం రైతుల విజయంగా భావిస్తూన్నామని అన్నారు. దీనికి అన్ని వర్గాల ప్రజలు అన్ని ప్రజా సంఘాలు, ప్రతిపక్షాలు, వామపక్షాలు,సహకారంతో ఈ ఒక మూడు నల్ల చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడం జరిగింది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతులు , ఆదివాసీలు , దళితులు వర్గాల సమస్యలను చట్టాలను కాపాడాలని ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ మరియు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు శ్యామ్ రావు, సోనేరావ్, కార్యదర్శి మనోజ్, భరత్, పట్టణ అధ్యక్షులు ప్రకాష్, విద్యార్థి సంఘాల నాయకులు రాహుల్,భాస్కర్, వరుణ అశోక్ దినేష్, తుకారాం, మాడవి జ్యోతిరాం తదితరులు పాల్గొన్నారు..
Recent Comments