🔴 శాఖాపరమైన విచారణ తర్వాత బోవెన్‌పల్లి పిఎస్ లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ ఆకాష్ భట్‌ను తొలగించిన నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్
రిపబ్లిక్ హిందుస్థాన్, హైదరాబాద్ వెబ్ డెస్క్:
ఓ మహిళను బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బులు డిమాండ్ చేస్తున్నా కానిస్టేబుల్ ను నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ విచారణ అనంతరం విధుల నుండి తొలగించారు.
ఈ సందర్బంగా ఓ ప్రకటనలో వివరాలు వెల్లడించారు.
ఈ నెల 15న పెట్రోలింగ్ చేస్తుండగా బోవెన్‌పల్లి డెయిరీ ఫామ్ సమీపంలో జి.ప్రవీణ్‌కుమార్, అతని మహిళా స్నేహితురాలు కలిసి ఉన్న విషయాన్నీ గుర్తించిన కానిస్టేబుల్ వారితో అసభ్యకరంగా మాట్లాడుతు దూషించాడు. ప్రవీణ్‌కుమార్‌ను దుర్భాషలాడడంతో పాటు డబ్బులు డిమాండ్ చేశాడు. తొలుత బాధితురాలి నుంచి రూ.15వేలు వసూలు చేసి వారి ఫోన్ నంబర్లను నోట్ చేసుకున్న తర్వాత వదిలేశాడు.
ఆ తర్వాత ఆకాష్ భట్ బాధితులను ఫోన్‌లో వేధిస్తూ మరింత డబ్బు డిమాండ్ చేస్తూ మళ్లీ రూ.15వేలు వసూలు చేశాడు.
వేధింపుల భరించలేక బాధితురాలు బొవెన్ పల్లి పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ పై ఫిర్యాదు చేయడం తో కేసు నమోదు చేసుకున్న ఎస్ హెచ్ ఓ కానిస్టేబుల్‌పై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.
అతని చర్య క్రమశిక్షణతో కూడిన శక్తిలో నైతిక గందరగోళానికి సమానం కాబట్టి అతను తక్షణమే సేవ నుండి తొలగించబడ్డాడు.(translated)
https://m.facebook.com/story.php?story_fbid=1987625858076809&id=326762537496491


Recent Comments