🔶 మారుమూల గ్రామీణ ప్రజలకు పోలీసులపై విశ్వాసం రెట్టింపు అయ్యే విధంగా పనితనాన్ని మెరుగుపరచాలి
🔶 ఉట్నూర్ సబ్ డివిజన్ పై ప్రత్యేక దృష్టి
🔶 ఉట్నూర్ సబ్ డివిజనల్ పోలీస్ అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసిన జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి
రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :
జిల్లాలో గల అన్ని మారుమూల గ్రామీణ ప్రాంతాలను సందర్శించి, వారి స్థితిగతులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి సూచించారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు పోలీసులపై గల నమ్మకాన్ని రెట్టింపు చేసే విధంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని కృషి చేయాలని సూచించారు. ఎటువంటి సమస్యలు నైనా గ్రామీణ ప్రాంత ప్రజలు పోలీస్ అధికారుల దృష్టికి తీసుకురావాలని, తెలియజేయాలని సాధ్యమైనంత త్వరగా సమస్యల పరిష్కారానికి పోలీసు అధికారులు ఎల్లవేళలా అందుబాటులో ఉంటారని తెలియజేశారు.
జిల్లాలో పూర్తిగా అసాంఘిక కార్యకలాపాలను అంతమొందించాలి అని సూచించారు. సోమవారం ఉదయం ఇంద్రవెల్లి పోలీస్ స్టేషన్ నందు ఉట్నూర్ సబ్ డివిజనల్ పోలీస్ అధికారులు అందరితో జిల్లా ఎస్పీ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఉట్నూర్ సబ్ డివిజనల్ నందు ప్రతి యొక్క పోలీస్ స్టేషన్లో సిబ్బంది విధుల పట్ల, పోలీస్ స్టేషన్ నిర్వహణను, సబ్ డివిజన్ పరిధిలో జరుగు ప్రతి ఒక్క అంశాల పట్ల పోలీస్ స్టేషన్ ఎస్హెచ్వోలకు పూర్తి అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. మట్కా, జూదం, గాంజాయి, గుడుంబా లాంటి వాటిని పూర్తిగా కట్టడి చేయాలని సూచించారు. మండలంలో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరిపై కఠిన మైన చర్యలు తీసుకోవాలని, ఎప్పటికప్పుడు సిబ్బంది పోలీస్ స్టేషన్ కార్యచరణను నవీకరిస్తూ ఉండాలని తెలిపారు. అదేవిధంగా స్టేషన్ వెర్టికల్స్ బ్లూ కోర్ట్, పెట్రో కార్, ఎస్హెచ్ఒ, స్టేషన్ రైటర్, క్రైమ్ ఇన్వెస్టిగేషన్, 5 S, తదితర అంశాలను ఎప్పటికప్పుడు నవీకరిస్తూ ఉండాలని సూచించారు. అలాగే స్టేషన్కు వచ్చే ప్రతి ఒక్క ఫిర్యాదు దారిపట్ల గౌరవంగా వ్యవహరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉట్నూర్ ఎఎస్పీ హర్షవర్ధన్ శ్రీవాస్తవ, సబ్ డివిజనల్ సిఐలు వై రమేష్ బాబు, సైదరావు, ప్రేమ్ కుమార్, ఎం నైలు, ఎస్సైలు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


Recent Comments