ఇచ్చోడ : సోమవారం రోజున ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఉదయం 11 గంటలకు ఇచ్చోడ మండల కేంద్రములోని స్థానిక అంబెడ్కర్ చౌరస్తాలో కేంద్రములోని బి.జె.పి ప్రభుత్వం తెలంగాణ రైతాంగం పట్ల అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానానికి,ధాన్యం కొనుగోలు చేయమని తేల్చి చెప్పిన వైఖరికి వ్యతిరేకంగా నిరసన కద్యక్రమనికి తెరాస శ్రేణులు హాజరు కావాలని ఇచ్చోడ మండల కన్వీనర్ రాథోడ్ బాపురావ్ అన్నారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మ దహన కార్యక్రమములో బోథ్ శాసనసభ్యులు రాథోడ్ బాపురావు పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమములో ప్రజాప్రతినిధులు,నాయకులు,కార్యకర్తలు మరియు రైతులు పెద్ద మొత్తములో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మండల కన్వీనర్ ఏనుగు కృష్ణ రెడ్డి కోరారు.

Recent Comments