◾️ఏజెన్సీ చట్టాలకు తూట్లు పొడుస్తూ మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకోం …… ◾️ఆదివాసి సేన భద్రాద్రి కోత్తగూడెం జిల్లా కన్వీనర్ ఉకే రవి…..
రిపబ్లిక్ హిందుస్థాన్, ములకలపల్లి(భద్రాద్రి కోత్తగూడెం జిల్లా) : ఇటీవల కాలంలో చండ్రగోండ మండలంలో పొంగులేటి క్యాంప్ కార్యాలయం ప్రారంభించటానికి వచ్చి ఏజెన్సీలో గిరిజనేతరులకు హక్కులు కల్పించాలని మాట్లాడిన తీరు సబబు కాదని,ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనేతరులకు ఏ రకంగా హక్కులు ఇస్తావు,ఏ రకంగా చట్టబద్ధత కలిగిస్తావు అని ఇప్పటివరకు ఏజెన్సీలో గిరిజనేతరులకు ఎవరికైనా అటవీ హక్కుల గుర్తింపు పట్టాలకు అర్హత ఉందా?? ఏజెన్సీ చట్టాలను తెలివిగా తప్పుదోవ పట్టించినట్టు తూట్లు పొడుస్తూ మాట్లాడడం పద్ధతి మార్చుకోమని, హక్కులు కల్పించడం అంటే చట్టాలకు తూట్లు పొడవడమేనని ఇంకా తేనె పూసిన కత్తిలా ఎన్ని రోజులు నటిస్తావని,మీ గత చరిత్ర మీరు పదవిలో ఉన్నప్పుడు ఆదివాసీలను ఏ రకంగా ఇబ్బంది పెట్టారు, ఏ రకంగా చట్టాలకు విరుద్ధంగా పనిచేశారో మాకు అందరికీ తెలిసిందే అని అదే విధంగా అమాయక ఆదివాసీల మీద తప్పుడు కేసులు నమోదు చేపించి దాడి,ఇబ్బందులు చేపించిన తీరు ఆదివాసుల పక్షాన చట్ట ప్రకారంగా న్యాయపోరాటం చేస్తున్నారని హైకోర్టు లాయర్ల దగ్గర వెళ్లి గిరిజనుల పక్షాన నిలబడ వద్దు అని చెప్పిన తీరు,అలాగే ములకలపల్లి,అన్నపురెడ్డిపల్లి,చండ్రుగొండ తదితర మండలాలలో ఉన్న గ్రామాలను నాన్ ఏజెన్సీ అని కేసులు పెట్టించిన తీరులో తమరు హస్తం,అలాగే కొన్ని పోలీస్ స్టేషన్లో ఆదివాసి సేన నాయకుల మీద కేసులు నమోదు చేయమని అధికారులకు చెప్పిన తీరు ఇంకా ఆదివాసి సమాజం ఆదివాసి సేన నాయకులు మర్చిపోలేదని వాటిని మరల గుర్తు చేశారు.అశ్వాపురంలో ఒక గిరిజనేతరుడికి వత్తాసు పలుకుతూ,గిరిజనేతరుడి దగ్గరే ఆయుధాలు కలిగి ఉండి, ఆదివాసీల భూముల్ని అక్రమంగా చట్టవిరుద్ధంగా ఆక్రమించి ఉన్నా,ఆదివాసిలే దాడి చేశారని బయటకు చెప్పి సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తూ,అబద్ధాన్ని నిజమని నమ్మించిన తీరు,మండలం లో 144 సెక్షన్ అమలులో ఉన్నా 1/70, LTR,పెసా తదితర చట్టాలకు ఉల్లంఘించి మాట్లాడిన తీరు ఇంకా సమాజం మర్చిపోలేదని, లోపల ఏజెన్సీ చట్టాలకు వ్యతిరేకంగా పనిచేసే ఆలోచనలను పెట్టుకొని బయట మంచి వాడిలా మాట్లాడే పద్ధతి మార్చుకోవాలని గతంలో లాగా ఆదివాసులు గుడ్డిగా నమ్మే పరిస్థితి లేదని అందరి కుహ్నా ఆలోచన రాజకీయాలను కనిపెడుతున్నారని వారు అన్నారు.
#పొంగులేటికి చిత్తశుద్ధి ఉంటే ఏజెన్సీ చట్టాల అమలు విషయంలో బహిరంగ ప్రకటన ఇవ్వాలని, ఏజెన్సీలో చట్టవిరుద్ధంగా గిరిజనేతరుల ఆధీనంలో ఉన్న లక్షల ఎకరాలను చట్ట ప్రకారంగా గిరిజనులకు పంచాలని అలాగే చట్టవిరుద్ధంగా ఉన్న గిరిజనేతరులను ఏజెన్సీ ప్రాంతం నుంచి పంపివేస్తూ 6A, 6B కేసులు ఎన్ని నమోదు చేశారో బహిరంగపరచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలని వారు సూచించారు. కనీసం తనకే చట్టాల అమలు మీద చిత్తశుద్ధి లేదని ఏ రకంగా ఏజెన్సీలో గిరిజనేతరులకు సంబంధించిన ఆఫీసులు ఓపెన్ చేస్తారని, అక్కడ ఏజెన్సీ చట్టాలను గౌరవించిన తీరు ఏంటో ఇక్కడే తన రంగు ఏజెన్సీ చట్టాల మీద చిత్తశుద్ధి, గౌరవం బయట పడుతుందని వారు వాపోయారు. ఇంకా ఎన్ని రోజులు మేక తోలు కప్పిన తోడేలు లాగా నటిస్తారని ఇప్పటికైనా గిరిజనేతరుల అసలు రంగు ఆదివాసీలు కనిపెట్టాలని ఏ పార్టీలో ఉన్నా,ఎక్కడ ఉన్న గిరిజనేతరులు అంతా ఒకటేనని ఆదివాసీలు గ్రహించాలని వారు పిలుపునిచ్చారు. ఇప్పటికైనా గిరిజనేతర వ్యక్తులకు,పార్టీల కు బినామీగా ఉండకుండా స్వచ్ఛందంగా ఎవరి గ్రామాలలో వారే మనకున్న చట్టాలను అమలు చేస్తూ స్వయంపాలన,రాజ్యాధికారంను అమలు చేసి కొమరం భీమ్,బిర్శా ముండా తదితర వీరుల ఆశయాలను సాధించడానికి కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేల భరతం కూడా త్వరలో పడతామని వాటికి నమూనా కూడా సిద్ధం చేస్తున్నామని ఆదివాసీలు చట్టాల హక్కుల రక్షణకై అందరికీ సహకరించి ప్రతి ఒక్కరు ఉద్యమాలకి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కీసర నాగేష్,కొర్రి నాగేష్, సడియం వీరభద్రం,ఊకే కృష్ణ, సున్నం ముత్యాలు,ఊకె నాగులు తదితరులు పాల్గొన్నారు.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments