Tuesday, October 14, 2025

అప్పుడు ఎన్టీఆర్.. ఇప్పుడు చంద్రబాబు…

టీడీపీ అధినేత నారా చంద్రబాబు సతీమణి భువనేశ్వరి (Nara Bhuvaneswari) కుప్పంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా బుధవారం కుప్పం నియోజకవర్గం శాంతిపురంలో మహిళలతో భువనమ్మ ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు.

Thank you for reading this post, don't forget to subscribe!

మహిళలకు మొట్టమొదటగా అన్ని విధాలగా గౌరవం తీసుకువచ్చింది నందమూరి తారకరామారావే (Nandamuri Tarakarama Rao) అని చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ (NTR) .. మహిళలకు రెగ్యులేషన్ తీసుకొచ్చారన్నారు. మహిళలకు తిరుపతిలో మహిళా పద్మా యూనివర్సిటీ ప్రత్యేకంగా స్థాపించారన్నారు. లోకల్ బాడీస్‌లో నందమూరి తారకరామారావు.. మహిళలకు రిజర్వేషన్స్ తీసుకొచ్చారని వెల్లడించారు. ఆయన వల్లే మహిళలకు లోకల్ బాడీస్‌లో ప్రాధాన్యత వచ్చిందని తెలిపారు.

తర్వాత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) హయాంలో హైస్కూలు ప్రతి మండలాల్లో ఉండాలని, అలాగే జూనియర్ కాలేజీలు కూడా తీసుకొచ్చారన్నారు. ఇంజినీరింగ్ కాలేజ్ తర్వాత ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజ్ బాబు తీసుకొచ్చారని గుర్తు చేశారు. మహిళలకు విద్యారంగంలో స్థానిక సంస్థలో 53% రిజర్వేషన్ చంద్రబాబు నాయుడు చట్టం తీసుకొచ్చారన్నారు. డ్వాక్రా మహిళా గ్రూప్ చంద్రబాబు నాయుడు తీసుకొచ్చారని తెలిపారు. 1997లో బాలిక శిశు సంరక్షణ పథకాన్ని కింద పుట్టిన ఆడబిడ్డలకి రూ.5000 అకౌంట్లో వేశారన్నారు. దేశంలో తొలిసారిగా దళిత్ మహిళా స్పీకర్‌గా ప్రతిభా భారతికి అవకాశం ఇచ్చారన్నారు. చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు విభజన జరిగిన తర్వాత కూడా మహిళలకి చాలా ప్రాధాన్యత ఇచ్చారన్నారు.

వైసీపీ ప్రభుత్వం (YCP Government) దిశ పథకం తీసుకొచ్చిందని.. దిశా పథకం ద్వారా మహిళలకు రక్షణ ఏమన్నా ఉందా అని ప్రశ్నించారు. ఇప్పుడు గంజాయి నంబర్ వన్ స్టేట్‌గా మారిపోయిందన్నారు. ఆంధ్రప్రదేశ్ నంబర్ వన్ స్టేట్ ఇన్ రేపింగ్ అత్యాచారంగా మారిందని… ఇది ఎంత సిగ్గుచేటని మండిపడ్డారు. ఆడపిల్లని నిర్బంధించి అత్యాచారాలు పెరిగిపోయాయని నారా భువనేశ్వరి వ్యాఖ్యలు చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

మీ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు మాకు పంపండి
error: Content is protected !!