ఆదిలాబాద్ : పట్టణంలో ప్రజలను మోసం చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా సభ్యుల నిజస్వరూపం బయటపడింది. అమ్మాయిల గొంతు మార్చి మాట్లాడుతూ, లివింగ్ రిలేషన్షిప్ పేరుతో డబ్బులు ఎగరేసుకుంటున్న కేటుగాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించిన వివరాల ప్రకారం, నిందితులు వివిధ జిల్లాల్లో ప్రజలను మోసం చేస్తూ సేకరించిన డబ్బులతో ఖరీదైన మొబైల్ ఫోన్లు, బైక్‌లు కొనుగోలు చేసినట్లు తేలింది.

నిందితుల వివరాలు:
A1. మాలోత్ మంజి @ కృష్ణవేణి (21), S/o బాలు, రామచంద్రపురం తండా, మఠంపల్లి మండలం, సూర్యాపేట జిల్లా.
A2. బుక్య గణేష్ (19), S/o శ్రీను, అదే గ్రామానికి చెందినవాడు.
A3. రూపవత్ శ్రావణ్ కుమార్ (18), S/o శంకర్, అదే గ్రామానికి చెందినవాడు.
A4. ఒక మైనర్ బాలుడు, రామచంద్రపురం తండా, మఠంపల్లి మండలం, సూర్యాపేట జిల్లా.
మోసాల వివరాలు:
ఆదిలాబాద్ పట్టణానికి చెందిన బాధితుడు లక్ష్మీకాంత్ వద్ద రూ. 8 లక్షలు మోసం చేసిన కేసు (Cr. 65/2025, Sec 318(4) BNS & 66-D IT Act).
నిజాంపేట్, మెదక్ జిల్లాకు చెందిన సంతోష్ వద్ద రూ. 48,000 మోసం.
కామారెడ్డి జిల్లా లింగంపేటకు చెందిన రాములు వద్ద రూ. 1,08,000 మోసం.
కర్ణాటకలోని బెంగళూరులో కూడా ఒకరిని మోసం చేసినట్లు విచారణలో తేలింది.
మోసం విధానం:
నిందితులు అమ్మాయిల గొంతు మార్చి వీడియో కాల్‌ల ద్వారా మాట్లాడి, “మ్యారేజ్ బ్యూరో”, “లివింగ్ రిలేషన్షిప్” పేరుతో మోసాలు చేశారు. అంతేకాకుండా, పశువుల ఎముకలతో నకిలీ క్షుద్ర పూజలు చేస్తూ సమస్యలు పరిష్కరిస్తామని ప్రజలను నమ్మించి డబ్బులు ఎగరేశారు.
దర్యాప్తు కొనసాగుతోంది:
ముఠాలో మరికొందరి పాత్రపై దర్యాప్తు కొనసాగుతుందని, ఇంకా అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయని డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఒకటో పట్టణ సీఐ బి. సునీల్ కుమార్, డబ్ల్యుపీఎస్ ఇన్స్పెక్టర్ ప్రేమ్ కుమార్, ఐటి కోర్ ఎస్సై గోపికృష్ణ, ఎస్సై రమ్య, ఏఎస్ఐ గోకుల్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


Recent Comments