Friday, November 22, 2024

ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం మిల్లర్ల తో కుమ్మక్కై రైతులను నిర్లక్ష్యం చేస్తోంది…..

— బిజెపి నేరేడుచర్ల కిసాన్ మోర్చ

రిపబ్లిక్ హిందుస్థాన్, సూర్యాపేట : నేరేడుచర్ల మండల కేంద్రం లో రాఘవేంద్ర వే బ్రిడ్జ్ కాంటాలో ఒక్కొక్క ట్రాక్టర్ కాంటా పెడితే 10 క్వింటాల తరుగు చూపిస్తున్నదని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆరు గాలం శ్రమించి పండించిన పంట ప్రకృతి వైపరీత్యాలకు దెబ్బతిని మిగిలిన పంటను అమ్ముకుందామంటే  వే బ్రిడ్జి తూకాల్లో కూడా కొంతమంది  మిల్లర్లు రైతుల్ని మోసం చేస్తున్నారని బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు కొణతం లచ్చిరెడ్డి  వాపోయారు . అలాంటి వారిపై సంబంధిత అధికారులు చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని,  ఇలాంటివి మరల జరగకుండా మిల్లర్ల యాజమాన్యాన్ని హెచ్చరిస్తూ ఎప్పటికప్పుడు తనికీలు నిర్వహించాలని గిట్టుబాటు ధర కల్పించాలని స్థానిక ఎమ్మార్వో కార్యాలయంలో ఆర్ ఐ కి  మెమొరాండం అందించారు. అకాల వర్షాలతో చీడపీడలతో అడుగడుగునా ఆగమైపోతున్న రైతన్నలను ఆదుకోవాల్సిన ప్రభుత్వం రైతును అరిగొస పట్టిస్తుందని, రుణ మాఫీ చేయట్లేదని, ఎరువులు ఉచితంగా ఇస్తామని కనీసం సబ్సిడీ కూడా ఇవ్వడంలేదని, కేంద్రం ప్రవేశ పెట్టిన పంటభీమా పథకం (ఫసల్ భీమా యోజన పథకం) అమలు చేయట్లేదని చివరికి మిల్లర్ల తో కుమ్మక్కై ఇలా కూడా రైతును దోచుకుంటున్నారన్నారు. ఇంత జరుగుతున్న అధికార పార్టీ ఎమ్మెల్యే కానీ వారి నాయకులకు నోరు విప్పకుండా చోద్యం చూస్తున్నారు . ఇదంతా కూడా వారి కనుసైగల్లోనే జరుగుతుందని ప్రజలు అనుకుంటున్నారు.ధాన్యం  కొనుగోలులో జరుగుతున్న మోసాలనుఅరికట్టాలని మోసం చేసిన రాఘవేంద్ర మిల్లుని సీజ్ చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది అన్నారు. ఈ కార్యక్రమంలో హుజూర్నగర్ నియోజకవర్గ కన్వీనర్ బాల వెంకటేశ్వర్లు, మండల అధ్యక్షులు పార్థనబోయిన విజయ్ కుమార్ పట్టణాధ్యక్షులు సంకలమద్ది సత్యనారాయణ రెడ్డి కిసాన్ మోర్చ్ పట్టణ, మండల అధ్యక్షులు తాళ్ల నరేందర్ రెడ్డి, పర్సనబోయిన సత్యం, ప్రధాన కార్యదర్శ లు కొణతo నాగిరెడ్డి,  పగిడి శ్రీనివాస్, చింతలచేర్వు సతీష్, మట్టయ్య, రాజేష్ రెడ్డి, కోటయ్య, కాంపెళ్ళి నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రాఘవేంద్ర రైస్ మిల్లును — రాఘవేంద్ర వే బ్రిడ్జ్ ను సీజ్ చేయాలి

వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నేత ధనుంజయ నాయుడు డిమాండ్

రాఘవేంద్ర రైస్ మిల్ ,రాఘవేంద్ర వే బ్రిడ్జ్ వద్ద రైతులతో కలిసి నిరసన తెలుపుతున్న వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నేత ధనుంజయ నాయుడు

రిపబ్లిక్ హిందుస్థాన్, సూర్యాపేట : నేరేడుచర్ల మండలం లో  రైతులను నిలువునా దోపిడీ చేస్తున్న నేరేడుచర్ల కు చెందిన రాఘవేంద్ర రైస్ మిల్లును – రాఘవేంద్ర వే బ్రిడ్జి కాంటాను తక్షణమే సీజ్ చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి ధూళిపాళ ధనుంజయ నాయుడు డిమాండ్ చేశారు.

బుధవారం నాడు ఆయన రాఘవేంద్ర రైస్ ముందు నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొని ప్రసంగిస్తూ……
గత కొద్ది రోజులుగా రాఘవేంద్ర వేబ్రిడ్జి కాంటా వారు రాఘవేంద్ర రైస్ మిల్ కు వస్తున్న ధాన్యాన్ని తూకం వేస్తూ తూకంలో అవకతవకలకు పాల్పడుతూ నిన్న ఒక్కరోజే ఒక ట్రాక్టర్లు  సుమారుగా పది క్వింటాళ్ల ధాన్యాన్ని తక్కువగా చేసి చూపించి రైతులను దోచుకునేందుకు ప్రయత్నించగా అనుమానం వచ్చిన రైతులు నిలదీయగా అసలు విషయం బయటపడిన  విషయం తెల్సిందే.  పేద మధ్య తరగతి రైతులు పొలాలను కౌలుకు తీసుకొని ఆరుగాలo శ్రమించి ప్రకృతి వైపరీత్యాలకు తట్టుకొని నకిలీ విత్తనాలు నకిలీ పురుగు మందులు ధాటికి తట్టుకొని పండించిన పంటను అమ్ముకునేందుకు అంగడికి వస్తే గుడిని గుడిలో లింగాన్ని మింగేసే విధంగా ఒక్కొక్క ట్రాక్టర్కు పది క్వింటాళ్ల ధాన్యాన్ని దోపిడి చేస్తుంటే ఆ అమానుషాన్ని ఎదిరించిన రైతాంగానికి 24 గంటల గడిచిన ఎలాంటి న్యాయం జరగలేదని అన్నారు. తక్షణమే సంబంధిత అధికారులు రంగంలోకి దిగి మిల్లు కాంట్రాక్టర్ను వే బ్రిడ్జి కాంట్రాక్టర్ ను అదుపులోకితీసుకొని చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని,  తక్షణమే మిల్లును, వే బ్రిడ్జి కాంటాను సీజ్ చేయాలని ధనుంజయ నాయుడు కోరారు.
నిరసన కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు రావుల సత్యం శేశిరెడ్డి సతీష్ సోమిరెడ్డి లక్ష్మారెడ్డి తదితరులు ఉన్నారు.

౼ 【సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల ప్రతినిధి】


Discover more from republichindustan.in

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

మీ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు మాకు పంపండి