భవసంగ్ మహారాజ్ మరియు మ్యారామ యాడీ మాకుల క్షేత్ర బులెటిన్
*లంబాడీలను కించ పరిచిన అధికారుల పై, ఆలయ పూజారుల పై చర్య తీసుకోవాలి జాదవ్ రమేష్ నాయక్*
*హుండీ లెక్కలలో వచ్చిన బంగారం, వెండి వస్తువుల లెక్కలు చూపని అధికారుల పై చర్య తీసుకోవాలి జాదవ్ రమేష్ నాయక్…
మరిపెడ మండలం : మాకుల తండా లో ఉన్న మ్యారామ యాడీ గుడి దగ్గర లంబాడీల ఐక్య వేదిక ఆధ్వర్యం లో మీడియా సమావేశాన్ని నిర్వహించడం జరిగింది అట్టి కార్య క్రమానికి లంబాడీల ఐక్య వేదిక రాష్ట్ర ముఖ్య సమన్వయ కర్త జాదవ్ రమేష్ నాయక్ హాజరు అయ్యి మాట్లాడడం జరిగింది.
26 ఏప్రిల్ 2025 న జరిగిన లంబాడీల మాకుల ఆత్మ గౌరవ సదస్సు గురించి తప్పుడు సమాచారం ఇస్తూ ఆ రోజు ముఖ్య అతిథిగా వచ్చిన మేధావి ప్రొఫెసర్ మాజీ ఎంపీ సీతారాం నాయక్ గారు, అలాగే విశిష్ట అతిథి గా వచ్చిన కాస్నా నాయక్ లను, అలాగే జాతి ప్రజలను కించ పరుస్తూ, భవసంగ్ మహారాజ్, మ్యారామ యాడీ లను కించ పరుస్తూ మీడియా సమావేశం పెట్టీ, పార్టీ నాయకుల తో కూర్చొని కించ పరిచి మాట్లాడిన ఆలయ అధికారులు, పూజారుల పైన చర్య తీసుకోవాలని జాదవ్ రమేష్ నాయక్ డిమాండు చేయడమా జరిగింది .
అలాగే చరిత్రను వక్రీకరించి కాకతీయుల నాటి గుడి అని చెప్పడం హాస్యాస్పదం అని చెప్పడం జరిగింది, కాకతీయుల కాలం క్రీ శ 750 నుండి 1325 వరకు అని గుర్తించుకోవాలని కోరారు, అలాగే కాకతీయులు శైవ భక్తులు అని , వారు శైవ మత వ్యాప్తి కోసం గుడులు కట్టారు అని తెలియ చేసారు, అలాగే ఇక్కడ ఉన్న మాకుల క్షేత్రం వైష్ణవ క్షేత్రం అని తెలియ చేసారు. ఇక్కడ భవసంగ్ మహారాజ్ బాలాజీ భక్తుడు అని తెలియ చేసారు.
భవసంగ్ మహారాజ్ కోసం అలాగే మ్యారామ యాడీ కోసం మాత్రమే లంబాడీలు వస్తారు అని తెలియ చేసారు. కానీ ఇక్కడ భవసంగ్ మహారాజ్ లేడు మ్యారామా యాడీ లేదు అని కించపరిచి మాట్లాడిన ఆలయ పూజారి పై చర్యలు తీసుకోవాలి అని, అలాగే చరిత్రను వక్రీకరించి న వారి పై చర్యలు తీసుకోవాలి
హుండీ లెక్కలలో వచ్చిన ఆభరణాల గురించి ఎలాంటి సమాచారం లేనందున అది అడగని ప్రయత్నం చేసినందుకు దాడి కి ఉసికోల్పిన వారి పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు.
ఈ కార్య క్రమం లో జిల్లా గిరిజన మోర్చ నాయకులు భూక్యా సుధాకర్ నాయక్,
లంబాడీల ఐక్య వేదిక రాష్ట్ర యువజన నాయకులు భూక్యా గోపి నాయక్
పూజారుల సంఘం జిల్లా నాయకులు రాజు సాధ్ గారు, సేవాలాల్ మహారాజ్ పూజారి ఠాగూర్ సాద్, బుడియా బాపు పూజారి సీతారాం నాయక్, అర్జున్ స్వామి లు, యువజన నాయకులు సుమన్ నాయక్ బానోత్, ఉజ్వల్ నాయక్ తదితరుకు పాల్గొనారు
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments