నివేదిక కోరిన హై కోర్టు…
Thank you for reading this post, don't forget to subscribe!
*విలేఖరి పై లాఠీచార్జి, చేతులు విరిచాడని ఫిర్యాదు..*
*మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట ఎస్సై గండ్రతి సతీష్ అకారణంగా ఒక విలేకరిని, అతనితోపాటు అతని తమ్ముడిని చితకబాది, తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు అయింది..*
*మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట ఎస్సైగా పనిచేస్తున్న గండ్రాతి సతీష్ గత నెల 15వ తేదీన నర్సింహులపేట పత్రిక విలేఖరిగా పనిచేస్తున్న మేకరబోయిన నాగేశ్వర్ అతని తమ్ముడిని.. నర్సింహులపేట నుండి పడమటిగూడెం వెళ్లే రోడ్డు వద్ద.. నర్సింహులపేట నర్సరీ వద్ద తీవ్రంగా కొట్టి, నర్సింహులపేట పోలీస్ స్టేషన్ లాక్ అప్ లో వేసి, మళ్లీ తీవ్రంగా కొట్టి చేతులు విరగొట్టి, వారిపై అక్రమ కేసులు పెట్టినందున, బాధితులు ఈ నెల 4 న తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.* రిట్ పిటిషన్ (డబ్ల్యూ. పి. నెం.) 9028/2024 ప్రకారం చట్ట విరుద్ధంగా అదుపులోకి తీసుకొని లాక్ అప్ లో వేసి, చితకబాది ఇరువురిని గాయపరిచిన ఎస్ఐ సతీష్ పై పోలీస్ అధికారులకు తెలపకుండా పోలీస్ లాకప్ లో వేసి, చిత్రహింసలకు గురిచేసిన.. జిల్లా డివిజనల్ స్థాయి పోలీస్ అధికారులు స్పందించకపోవడంతో *ఈ మేరకు హైకోర్టు.. రాష్ట్ర హోం శాఖ ప్రిన్సిపాల్ సెక్రెటరీ, డీజీపీ, ఐజి, ఎస్పీలకు నోటీసులు జారీ చేసింది. ఈనెల 25వ తేదీన ఆయా పోలీస్ అధికారులు పూర్తి నివేదికతో హాజరుకావాలని హైకోర్టు ఆదేశించింది.*
Recent Comments