Friday, November 22, 2024

తీన్మార్ మల్లన్న అరెస్ట్ దుర్మార్గపు చర్య : బండి

లిక్కర్ స్కామ్ , టిఎస్పీఎసి పేపర్ లీకేజీ పై నిరంతరం వార్తలు ప్రసారం చేసినందుకెనా ?? ఒక రోజు ముందే క్యూ న్యూస్ ఆఫీస్ పై దుండగుల దాడి, ఆధారాలు ఇచ్చిన అరెస్ట్ చేయని పోలీసులు … ప్రభుత్వ పెద్దల ఆదేశాల తోనే నా ?

చైనాలో కూడా ఇలాగే ఎవరన్న ప్రభుత్వ రూల్స్ ని విమర్శిస్తే విమర్శలు చేసిన వారి ఆచూకీ లభించదు. తెలంగాణ లో కూడా ప్రశ్నిస్తే జైలులో ఉంటున్నారు.

కేసీఆర్ ప్రభుత్వం పై గత కొన్ని రోజులుగా మల్లన్న అందిస్తున్న వార్తలను తట్టుకోలేక పోయారా? రాజ్యాంగం కల్పించిన హక్కును బీఆర్ ఎస్ ప్రభుత్వం కాలరాస్తుందా?? ఏ తెలంగాణ కోసమైతే కొట్లాడి సాధించుకున్నామో? ఆ తెలంగాణ లో ఇప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే పోలీస్ అరెస్ట్ తప్పదా అంటే ప్రస్తుతం పరిస్థితులు చూస్తుంటే నిజమే అనిపిస్తుంది. ఓ పక్క పేపర్ లీకేజీ తో రోడ్డున పడ్డ విద్యార్థులు తమ గోసను వినిపియ జుస్తే ఎక్కడికక్కడ వారిని అణిచివేత కు గురి చేస్తున్నారు. ప్రజాస్వామ్య దేశంలో తప్పు జరిగితే ఆ తప్పును వేలెత్తి చూపకుండా గమ్మున కుసునేల రాజకీయ క్రీడా మొదలు పెట్టేశారు పాలకులు.

క్యూ న్యూస్ ఆఫీస్ పై విచ్చలవిడిగా దాడి చేసిన వారిని పట్టుకొని పోలీసులు , బాధిత ఛానెల్ వారిని మాత్రం అరెస్ట్ చేశారు. దీన్ని బట్టి చూస్తుంటే ఎవరన్నా ప్రభుత్వ తప్పును ఎత్తిచూపితే ఇగ అంతే సంగతులు.

చైనా దేశంలో ఎలాగో మన తెలంగాణ లో కూడా అలాగే రూల్స్ తీసుకొచ్చారా ? అనే అనుమానాలు కలుగుతున్నాయి. తప్పును ప్రశ్నిస్తున్న ఒక ఛానెల్ ను మూసి వేసేందుకు ఎందుకు కుట్ర చేస్తున్నట్లు అని పలువురు ప్రతిపక్ష పార్టీ నాయకులనుండి ప్రభుత్వం పై విమర్శలు వెలువెత్తుతున్నాయి.

బిజెపి తెలంగాణ చీఫ్ బండి సంజయ్ : తీన్మార్ మల్లన్న, తెలంగాణ విఠల్ అరెస్ట్ లను తీవ్రంగా ఖండిస్తున్నానని బండి సంజయ్ అన్నారు. పోలీసు అధికారులతో ఫోన్ లో మాట్లాడి, వెంటనే వారిని విడుదల చేయాలని, లేనిపక్షంలో తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించడం జరిగింది. తీన్మార్ మల్లన్న, తెలంగాణ విఠల్ అరెస్ట్ దుర్మార్గం. ప్రశ్నించే గొంతులను అణిచివేయాలని అనుకుంటున్నారు. దొంగల్లా వచ్చి ఎత్తుకుపోతారా ?
ఖబడ్దార్ కేసీఆర్, వీరందరినీ బేషరతుగా విడుదల చేయాల్సిందే. జర్నలిస్ట్ విఠల్ ఆరోగ్యం బాగోలేదు, తనకు ఏం జరిగినా కేసీఆర్ దే బాధ్యత వహించాలి. లేనిపక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కేసీఆర్ పాలనలో తెలంగాణ ఉద్యమకారులకు పట్టిన గతి ఇదేనా ?
కేసీఆర్ పాలనలో ప్రజాస్వామ్యం మంట కలిసిపోతోంది. తెలంగాణ ఉద్యమకారులారా, ఇప్పటికైనా బయటకురండి, కల్వకుంట్ల కుటుంబ రాక్షస పాలనపై పోరాడుదాం.


Discover more from republichindustan.in

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

మీ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు మాకు పంపండి