— అది అఫీషియల్ సమావేశం కాదు అన్న ఎంపిడిఓ ..!
ఇచ్చోడ, ( రిపబ్లిక్ హిందూస్థాన్) : ఇచ్చోడ మండల ఎంపీడీఓ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జరిగిన సమావేశంలో కొంతమంది వ్యక్తులు భార్యల స్థానాల్లో హాజరయి అందరిని ఆశ్చర్య పరిచారు. ఇచ్చోడ ఎంపిడిఓ రాంప్రసాద్ సమక్షంలో జరిగిన ఈ సమావేశంలో హాజరవడంతో విషయం తెలిసిన ప్రజలు అవాక్కయ్యారు.

ఓ పక్క ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఎవరైనా మహిళ ప్రజాప్రతినిధులను హక్కులను గౌరవాన్ని అవమానించి వారి స్థానంలో కుటుంబ సభ్యులు హాజరైతే వారిని బేషరతుగా బయటకు పంపాలని గతంలో అధికారులను సూచించారు. కానీ ఎం లాభం .

గురువారం జరిగిన మెటీరియల్ కాంపోనెంట్ పై సమావేశానికి సర్పంచులను , ఉప సర్పంచులను , ఎం.జి.ఎన్ ఆర్.ఇజి.ఎస్ ఉపాధి హామీ పనుల పై సమావేశానికి ఆహ్వానించారు.
అయితే మహిళ సర్పంచుల స్థానంలో వారి భర్తలు సమావేశంలో హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో ఏ.పి.ఓ నరేందర్ గౌడ్ , ఎంపిఓ రమేష్ మండలంలోని ఆయా గ్రామ పంచాయితీల సర్పంచులు, ఉప సర్పంచులు,ఎన్ ఆర్ ఈజీ ఎస్ సిబ్బంది పాల్గొన్నారు.
ఈ విషయం పై ఎంపిడిఓ ను వివరణ కోరగా
ఎంపిడిఓ రామ్ ప్రసాద్ ను రిపబ్లిక్ హిందుస్థాన్ వివరణ కోరగా ఆ సమావేశం అధికారికంగా ( ఆన్ అఫిషియల్ ) నిర్వహించలేదని పేర్కొన్నారు. గ్రామ పంచాయితీ ల్లో పని చేస్తున్న వారిని మాత్రమే సమావేశానికి ఆహ్వానించామని పేర్కొన్నారు.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments