Thursday, November 21, 2024

Yechuri: కమ్యూనిస్టు దిగ్గజం కన్నుమూత

హైదరాబాద్ : కొంతకాలంగా శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన……. ఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ ఈరోజు మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు.

శ్వాసకోశ ఇన్ఫెక్షన్ కారణం గా సీతారాం ఏచూరి ఆగస్టు 19న ఎయిమ్స్ లో చేరారు. గత కొన్ని రోజుల నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తూ వస్తోంది. ఎయిమ్స్ వైద్యులు ఆయన కు వెంటిలేటర్ అమర్చి చికిత్స అందించారు..



సీతారాం ఏచూరి 1952 ఆగస్టు 12న చెన్నైలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు కల్పకం, సర్వేశ్వర సోమయాజులు ఏపీలోని కాకినాడకు చెందినవారు. చెన్నైలో పుట్టిన సీతారాం ఏచూరి హైదరాబాద్ లో విద్యాభ్యా  సం చేశారు. ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో బీఏ ఎకనామిక్స్ చదివారు.

1969 నాటి తెలంగాణ ఉద్యమంలో ఆయన ఢిల్లీ వేదికగా చురుగ్గా పాల్గొ న్నారు. 1974లో స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎస్ఎఫ్ఐ,లో చేరారు.

ఆ మరుసటి ఏడాది సీపీఐ (మార్క్సిస్ట్) పార్టీలో చేరారు. 1975 ఎమర్జెన్సీ సమయంలో ఆయన జేఎన్ యూ విద్యార్థిగా ఉన్నారు.


Discover more from republichindustan.in

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

మీ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు మాకు పంపండి