రిపబ్లిక్ హిందుస్థాన్, సిరికొండ : సిరికొండ మండలం లోని పొన్న గ్రామంలో కిరాణా షాపులో నిషేధిత గుట్కా ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సిరికొండ ఎస్సై నీరేష్ తెలిపిన వివరాల ప్రకారం… పొన్న గ్రామంలో నిషేధిత గుట్కాను విక్రయిస్తున్నట్లు ముందస్తు సమాచారం రావడం తో తనిఖీలు నిర్వహించగా, గ్రామం లో గల సెల్కే రామేశ్వేర్ అనే వ్యక్తి కిరణా షాప్ లో రూ.9570 విలువ గల నిషేధిత గుట్కా స్వాదీనం చేసుకుని నిందితుడిని పట్టుకున్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Recent Comments