ePaper
Tuesday, March 10, 2026
📄 ePaper

ADB – VIDEO : విదేశంలో ఉంటూ దేశంలో విద్వేషాలు రెచ్చగొట్టేలా పోస్టులు … విమానాశ్రయంలో పట్టుకున్న పోలీసులు

📰 Generate e-Paper Clip

Thank you for reading this post, don't forget to subscribe!

నిందితుని పాస్ పోర్ట్ మరియు రెండు సెల్ ఫోన్లు స్వాధీనం

టాంజానియా దేశంలో ఉంటూ ఇరు వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా వాట్సప్ గ్రూప్ లో పోస్ట్ పెట్టిన షేక్ ఇర్ఫాన్ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం లో అరెస్టు

రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్  :  టాంజానియా దేశంలో ఉంటూ ఇరు వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా వాట్సప్ గ్రూప్ లో పోస్ట్ పెట్టిన వ్యక్తి ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం లో అరెస్టు, రిమాండ్ తరలించినట్లు  ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి తెలిపారు.

నిందితుడు ఇతర దేశంలో ఉంటూ సీల్ శిలా silsila అనే వాట్సప్ గ్రూపు అడ్మిన్ గా వ్యవహరిస్తూన్నట్లు తెలిపారు.

అయితే నిందితుడు ఆదిలాబాద్ రూరల్ పోలీసులు రౌడీషీటర్ కైంచి సలీం అరెస్టు చేయగా,దానిని తప్పుపడుతూ చట్టపరంగా వ్యవహరించిన పోలీసు అధికారులను అవమానించేలా పోస్టులు పెట్టిననట్లు తెలిపారు.



నిందితునిపై ఏప్రిల్ నెలలో టూ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయినట్లు , జిల్లా ఎస్పీ  సిఫార్సుతో ఇమిగ్రేషన్ అధికారులు లుక్ అవుట్ సర్కులర్(LOC) జారీ చేయడంతో  ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం లో నిందితుడిని  అధికారులు డిటైన్ చేసినట్లు తెలిపారు.

అయితే నిందితుడు కొన్ని పోస్టులు ఇరువర్గాల మధ్య గొడవలకు దారి తీసేలా మరియు పోలీసులను కించపరిచేలా వాట్సాప్ గ్రూపుల నందు వాయిస్ మెసేజ్ లు, టెక్స్ట్ మెసేజ్లు చేసినట్లు తెలిపారు.

  ఏప్రిల్ నెలలో ఆదిలాబాద్ కు చెందిన రౌడీషీటర్ కైంచి సలీం ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేలా పోస్ట్ పెట్టినందుకు అతనిపై ఆదిలాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేయడం జరిగిందని, అతనిని అరెస్టు చేయడం జరిగిందని, ఆ సంఘటనపై…ఆదిలాబాద్ పట్టణంలోనీ ఖుర్షీద్ నగర్ కు చెందిన  నిందితుడు షేక్ ఇర్ఫాన్ (43)  టాంజానియా దేశంలో ఉంటూ ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి silsila adb అనే వాట్సప్ గ్రూపు యజమానిగా వ్యవహరిస్తూ, వాట్సాప్ గ్రూపు నందు పోలీసులను కించపరిచేలా మరియు ప్రజాశాంతికి భంగం కలిగించేలా విమర్శలు చేసి ఇరు వర్గాల మధ్య గొడవలు దారి తీసేలా పోస్టులు పెట్టినందుకు గాను అతనిపై ఏప్రిల్ 15వ తారీఖున ఆదిలాబాద్ టు టౌన్ పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు అయిందని, అతను ఇతర దేశంలో ఉన్నందున జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన ఐపిఎస్  సిఫార్సు మేరకు అతనిపై ఇమిగ్రేషన్ అధికారులు లుక్ అవుట్ సర్కులర్ జారీ చేయడం జరిగిందని తెలిపారు.

ఈ ఘటనతో మంగళవారం టాంజానియా నుండి ముంబై అంతర్జాతీయ విమానాశ్రయానికి రాగా, ఇదివరకే ఇతనిపై ఎల్ఓసి జారీ అయిన విషయాన్ని గుర్తించిన ఇమిగ్రేషన్ అధికారులు అతనిని పట్టుకొని ముంబై అంతర్జాతీయ విమానాశ్రయ పోలీసులకు అందజేయడం జరిగింది. జిల్లా పోలీసులకు సమాచారం ఇవ్వగా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఎస్సై పీర్ సింగ్ ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందం  అతనిని పట్టుకొని అరెస్టు చేయడం జరిగిందని ఆదిలాబాద్ డి.ఎస్.పి ఎల్ జీవన్ రెడ్డి తెలియజేశారు.

ఇతనిని ఈరోజు న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టగా 14 రోజుల జ్యూడిషల్ రిమాండ్ కు తరలించడం జరిగిందని తెలిపారు. ఇది వర్గాల మధ్య చిచ్చుపెట్టేలా గొడవలకు దారి తీసేలా పోస్టులు పెట్టిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. వాట్సప్ గ్రూపుల నందు సోషల్ మీడియాలో నందు పోలీసులను కించపరిచేలా, పోలీసు విధులకు భంగం కలిగించేలా, మనోభావాలకు దెబ్బతీసేలా పోస్ట్ పెట్టిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇతని వద్దనుండి ఒక పాస్ పోర్ట్ మరియు రెండు సెల్ ఫోన్లను స్వాధీనం చేసు కోవడం తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ టు టౌన్ ఇన్స్పెక్టర్ కె నాగరాజు, ఎస్ఐ పీర్ సింగ్, విష్ణు ప్రకాష్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!