— గిరిజన శక్తి రాష్ట్ర కమిటీ డిమాండ్
రిపబ్లిక్ హిందుస్థాన్, పాలకవీడు :
గిరిజన శక్తి రాష్ట్ర కార్యవర్గ విస్తృతస్థాయి సమావేశం రాష్ట్ర అధ్యక్షులు శరత్ నాయక్ అధ్వర్యంలో గురువారం ఉస్మానియా యూనివర్సిటీ గెస్ట్ హౌస్ సెమినార్ హాల్లో నిర్వహించారు. గిరిజన శక్తి రాష్ట్ర అధ్యక్షుడు శరత్ నాయక్ కీలకమైన కొన్ని తీర్మానాలను చేశారు. వాటిలో సేవాలాల్ మహారాజ్ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 15న సెలవు దినంగా ప్రకటించాలి. తెలంగాణలో కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయాన్ని వెంటనే ప్రారంభించాలి. గిరిజన గురుకులాలకు సొంత భవనాలను నిర్మించి, మౌలిక సదుపాయాలు కల్పించాలి. ఎస్సీ,ఎస్టీ కమిషన్ ను వేరుచేసి ఎస్టీ కమిషన్ ను వెంటనే ఏర్పాటు చేయాలి. ఎస్సీ,ఎస్టీ బ్యాక్ లాగ్ ఉద్యోగాల భర్తీ చేయాలని రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా, మండల స్థాయి నాయకులు అందరూ ఆమోదం తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ప్రకాష్ రాథోడ్ ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్, భీమ్లాల్ నాయక్ అసిస్టెంట్ కమిషనర్ జిఎస్టి, పొలిటికల్ సైన్స్ హెచ్ఓడి ప్రొఫెసర్ చంద్ర నాయక్, ఉస్మానియా యూనివర్సిటీ ఎస్సీ ఎస్టీ సెల్ డైరెక్టర్ ప్రొఫెసర్ మంగు నాయక్, తెలంగాణ ఎస్బిఐ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు సూర్యం ధరావత్ మరియు గిరిజన శక్తి ఫౌండర్ డాక్టర్ వెంకటేష్ చౌహన్, వర్కింగ్ ప్రెసిడెంట్ రాజు నాయక్, మోహన్ నాయక్ కట్ట చైర్మన్. ఉపాధ్యక్షులు డాక్టర్ భూక్యా రాజారాం నాయక్, భరత్ నాయక్, రవి నాయక్, పాండు జాదవ్, మహిళా అధ్యక్షురాలు జోష్నా నాయక్, సురేష్ సుధాకర్ మరియు రాష్ట్ర బాధ్యులు జిల్లా మండల యూనివర్సిటీల గిరిజన శక్తి బాధ్యులు పాల్గొన్నారు.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments