రిపబ్లిక్ హిందుస్థాన్ , రామగుండం :
Thank you for reading this post, don't forget to subscribe!రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జన్నారం పోలీస్ స్టేషన్ పరిధిలో, 16-05-2020 రోజున తమ బంధువును తీసుకెళ్లాడని కోపంతో ఎస్సీ మాల కులానికి చెందిన బాట్ల అన్వేష్ (17 సంవత్సరాలు) అనే యువకుడిని, నేరస్తులైన గారి పెళ్లి హరీష్ కుమార్ గౌడ్, ముత్యం సాయి, పట్కూట్ ప్రశాంత్, మహమ్మద్ అజ్మత్ ఖాన్ అనే నలుగురు చేతులు, బెల్టు, కర్రలతో కొట్టి గాయపరిచి కులం పేరుతో దూషించి చంపుతానని బెదిరించి మూత్రం తాగించి హింసించారు.
ఈ ఘటనపై బాధితుడు దరఖాస్తు మేరకు అప్పటి జన్నారం ఎస్సై ఎం. వినోద్ కుమార్ కేసు నమోదు చేయగా, జి. నరేందర్ ఏసిపి జైపూర్, మంచిర్యాల సబ్ డివిజన్ ఇంచార్జ్ గారు దర్యాప్తు చేసి, పైన నలుగురిపై సెక్షన్ 323, 324, 290, 506, r/w 34 IPC, Sec 3(1)(s) & 3(2)(va) SC/ST చట్టంలో దర్యాప్తు నివేదిక కోర్టులో దాఖలు చేశారు.
మంచిర్యాల కోర్టు లైజన్ అధికారి సయ్యద్ తాజాద్దీన్, CDO ఇఫ్తేకార్ అహ్మద్, ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ముస్కు రమణారెడ్డి లు 17 మంది సాక్షులను విచారించి నేరం రుజువు చేయగా, ప్రత్యేక న్యాయమూర్తి డాక్టర్ పి. శివరాం ప్రసాద్ గారు నలుగురు నేరస్తులకు ఒక్కొక్కరికి ఆరు నెలల జైలు శిక్ష, మరియు రూ. 4,000/- జరిమానా విధించారు.
నిందితులకు శిక్ష విధించడంలో కృషిచేసిన జన్నారం ఎస్సై జి. రాజవర్ధన్, సిఐ లక్షట్ పేట్ ఏ. నరేందర్ లను కోర్టు విధుల అధికారులను రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్ ఐజి మంచిర్యాల డిసిపి ఏ. భాస్కర్ ఐపీఎస్, మంచిర్యాల్ ఎసిపి ఆర్. ప్రకాష్ లు అభినందించారు.
Recent Comments