రిపబ్లిక్ హిందుస్థాన్, ఇంటర్నేషనల్ న్యూస్ : భారత దేశం నుండి వివిధ పనుల నిమిత్తం మరియు వ్యాపారం కోసం వెళ్లే తెలుగు వారిని ఒకటిగా చేసేందుకు సాటా ( SATA) ను స్థాపించడం జరిగిందని వ్యవస్థాపకులు మల్లేశ్ తెలిపారు.
సౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్ – SATA, లాభాపేక్ష లేని సంఘం, 2015 నుండి SATA వివిధ కార్యకలాపాలు మరియు సేవలతో 7 సంవత్సరాలుగా సౌదీ అరేబియా అంతటా భారతీయ కమ్యూనిటీకి సేవలు అందిస్తోంది. సౌదీ అరేబియా అంతటా స్థానిక భాషలు మరియు వివిధ వృత్తుల ద్వారా భారతీయ కమ్యూనిటీని కనెక్ట్ చేయడం ద్వారా వారిని ఒకే వేదికపై ఏకం చేయడం SATA యొక్క విజన్ అని స్థాపకుడు మల్లేశ్ అన్నారు.
తెలుగు, హిందీ, అరబిక్, ఇంగ్లీషుతో పాటు , సంస్కృతం మరియు అనేక ఇతర భారతీయ భాషలు ఉచితంగా నేర్పడం కోసం ఉచిత ఆన్‌లైన్ తరగతులు తో పాటు మైక్రోసాఫ్ట్, జాబ్స్ స్కిల్స్, కెరీర్ గైడెన్స్ వంటి వివిధ కార్యకలాపాల సేవలతో పాటు ఇంజినీరింగ్, విద్య మరియు వైద్య నిపుణులను ఏకం చేయడం వంటి కార్య్రమాలతో భారతీయ సమాజానికి సేవ చేయడం ద్వారా SATA అందరికీ చేరువ అయ్యిందని తెలియ చేశారు. సౌదీ అరేబియాలోని భారతీయ కమ్యూనిటీ (తెలుగు ప్రజలకే పరిమితం కాదు) ఎప్పుడైనా మరియు ఎక్కడైనా SATA నుండి ఎలాంటి మద్దతు, మార్గదర్శకత్వం మరియు కౌన్సెలింగ్ పొందవచ్చని అన్నారు.
సాటా ఆధ్వర్యంలో తెలుగు బాషా దినోత్సవం తో పాటు సంక్రాంతి, దసరా మరియు బతుకమ్మ వంటి సంబరాలను ఎంతో ఘనంగా నిర్వహించుకున్నామని అన్నారు. తెలుగు రాష్ట్రాల నుండి ఏజెంట్ ల ద్వారా జాబ్ కోసం వచ్చే వారు తమను సంప్రదిస్తే మోసపోకుండా చూడవచ్చని అన్నారు. ఈ మధ్య కాలంలో ఎజెంట్స్ మోసాలు ఎక్కువైనందున అనేక మంది ముఖ్యంగా మహిళలు అక్కడి నుండి నర్సింగ్ వంటి ఉద్యోగాల కోసం వచ్చి ఇక్కడ వచ్చిన తర్వాత మోసపోయామాని గ్రహిస్తున్నారని అన్నారు. ఈ రకంగా జరగకుండా చూడాలంటే తమను సంప్రదిస్తే ఏజెంట్ పేర్కొన్న ప్రదేశాలను పరిశీలించడం ద్వారా నిజ నిర్ధారణ జరుగుతుందని అన్నారు.
సాటా (SATA) అనేది ప్రతి వ్యక్తిని సమానంగా చూడడం, ఎదగడానికి అవకాశం కల్పించడం నాయకులు / పారిశ్రామికవేత్తలు మరియు అందరినీ ఒకే కుటుంబంగా (వసుధైక కుటుంబం)ల తయారు చేయడం కోసం పనిచేస్తుందని అన్నారు. సాటా లో పనిచేసే వందలాది కార్యవర్గ సభ్యులందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ విలువైన సమయాన్ని వెచ్చించి ఎంతోమందికి తమ సేవలు అందించి అదుకున్నారని, ఆదుకుంటారనీ అన్నారు.
వీరిలో ముఖ్యంగా.. ఈస్త్రన్ రీజియన్ నుండి తేజ, అవినాష్, మహేష్, తారక్, కిషోర్, విజయ, సంధ్య, శిల్ప, నవ్య, దివ్య తదితరులు, సెంట్రల్ రీజియన్ నుండి ఆనంద్, మహేంద్ర, ముజమ్మిల్, రంజిత్, సూర్య గారు, సుచరిత, అక్షిత, గీత, శ్రీదేవి, చేతన తదితరులు, వెస్ట్రన్ రీజియన్ నుండి, లక్ష్మణ్, సలీం బాషా, ఖుద్రత్ బైగ్, డా. నాగేష్, డా. జయ శంకర్, రషీద్, డా. తేజోవతి, మహేశ్వరి, కవిత, డా. చంద్రిక, లక్ష్మి రాజ్ తదితరులు వున్నారని తెలియ చేశారు.
కోవిడ్ సమయంలో అనేక మంది సాటా సేవలు వినియోగించుకున్నారని తెలిపారు. సౌదీలో ని భారతీయులు సాటా ద్వారా వివిధ అందుబాటులో నున్న సేవలు పొందాలని కోరారు. మరిన్ని వివరాలకు +919492342245/+966597384449 లకు వాట్సప్, SATA.TCWA@GMAIL.COM కు email చేయొచ్చు అని, https://global-indian.org/ వెబ్సైట్ ను కూడా వినియోగించు కోవచ్చునని తెలియ చేశారు.
బాధితుడి కి ఆపన్న హస్తం.... పొట్ట చేతబట్టుకుని సౌదీ అరేబియాకు వెళ్లి ఉపాధి లేక, అనారోగ్యం పాలై అత్యంత దుర్భర స్థితిలో కొట్టుమిట్లాడుతున్న తెలంగాణ ప్రవాసీ.. తిరిగి వచ్చేందుకు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఎదురు చూస్తున్నా తరుణంలో మల్లేష్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సాటా వాలంటీర్ సల్మాద్ ఖలీద్ , జబ్బార్ మిషన్ ( ప్రత్యేకంగా విరాళం) మరియు ఇండియన్ ఫోరమ్ ఫర్ ఎడ్యుకేషన్ సభ్యులు ముజమ్మిల్ ల సమన్వయంతో బాధితుడి కోసం విరాళాలు సేకరించారు.
ఈ తరుణంలో తాను షేక్‌లకు బకాయిపడ్డ 50 వేల రియాల్స్ (దాదాపు రూ.11 లక్షలు) చెల్లించి, వీసాను పునరుద్ధరించి, విమాన టికెట్‌ను సమకూర్చి తనను హైదరాబాద్ తరలించే ఏర్పాట్లు చేశారు. కష్టాల్లో ఉన్న భారతీయుల కోసం ఆపన్న హస్తం అందించిన సాటా మరియు ఇండియన్ ఫోరమ్ ఫర్ ఎడ్యుకేషన్ సభ్యులను సౌదీలో ని ఇండియన్ ఎంబసీ అధికారులు కృతజ్ఞతలు తెలిపారు.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments