హైదరాబాద్ : సౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్ (SATA) ఇంజనీరింగ్ దినోత్సవం (Engineers’ Day) సౌదీ అరబియాలో మన తెలుగు వారు కలిసి జరుపుకోవడం అనేది చాలా ఆనందముగా వున్నది అని SATA TBN అధ్యక్షలు యోగేశ్వర రావు వీరవల్లి అన్నారు.
SATA రియాద్ అధ్యక్షలు శ్రీనివాస్ మచ్చ మాట్లాడుతూ భారతదేశంలో ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 15న ఇంజనీరింగ్ దినోత్సవం జరుపుకుంటాము. ఇది ప్రముఖ ఇంజనీర్, స్వాతంత్య్ర సమరయోధుడు, మరియు భారతరత్న పురస్కార గ్రహీత సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి గౌరవార్థం, ఆయన పుట్టినరోజున జరుపుకునే దినోత్సవం. ఇంజనీరింగ్ రంగానికి ఆయన చేసిన సేవలను, ముఖ్యంగా నీటిపారుదల, జలవనరుల నిర్వహణలో ఆయన చేసిన కృషిని గుర్తుచేసుకుంటూ, ఇంజనీర్ల కృషిని అభినందించడానికి ఈ దినోత్సవాన్ని జరుపుకుంటాము.
ఇంజనీరింగ్ రంగంలో ఆయన చేసిన గొప్ప సేవలను, ముఖ్యంగా జలవనరుల ప్రాజెక్టులు, ఆనకట్టలు, వంతెనల నిర్మాణంలో ఆయన గొప్ప కృషి చేసారు.
తెలుగు ఇంజనీర్లకు SATA ఫౌండర్ మల్లేశన్ శుభాకాంక్షలు తెలియజేసారు.
SATA రియాద్ కోర్ టీం సభ్యులు, శర్వాణి విద్యాధరణి, కోకిల ఓత్లూరి, ప్రీతి చౌహాన్, మహమ్మద్ నూరుద్దీన్, సింగూ నరేష్ కుమార్, అహ్మద్ అబ్దుల్ కరీం, మహమ్మద్ అబ్దుల్ ఘఫ్ఫార్, మిధున సురేష్, ముదిగొండ శంకర్, మురళీ క్రిష్ణ బూసి, లోకేష్ తాళ్ల, అబ్దుల్ నయీం ఖయ్యూమ్, అయాజ్,
ఖాజా ముజమ్మిల్ ఉద్దీన్, అహ్మద్ మోహియుద్దీన్ రోజ్దార్ సయ్యద్ (అస్లాం), పెంటపాటి శ్రీ చరణ్ తదితరులు పాల్గొన్నారు.
సౌదీ అరబియా రియాద్ లో ఇంజనీరింగ్ దినోత్సవ వేడుకలు
RELATED ARTICLES
Recent Comments