— చాతి, ప్రవైట్ పార్ట్ పై దాడి
— పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు
రిపబ్లిక్ హిందుస్థాన్, నల్లబెల్లి : దసరా ఉత్సవాలలో దళితుడి పై సర్పంచ్ దాడి చేసి గాయపరచిన సంఘటన గురువారం వెలుగుచూసింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం గుండ్ల పహాడ్ గ్రామానికి చెందిన దళితులు బుధవారం జరిగిన దసరా ఉత్సవాలకు డప్పు కొట్టడానికి లేటుగా రావడంతో పాటు తక్కువ డబ్బులు తీసుకు వచ్చారు అంటూ తాటికాయల సూర్య అనే దళితుడిని గ్రామ సర్పంచ్ కదురు కటయ్య దుర్భాషలాడుతూ అతనిపై దాడి చేసి గాయపరిచాడు. ఈ దాడిలో బాధితుడు చాతి, ప్రయివేట్ పార్ట్ పై వాపు వచ్చినట్లు తెలిపారు. కాగా బాధితుడు గురువారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఎస్ఐ నార్లపురం రాజారాం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Recent Comments