కాంగ్రెస్ పార్టీ సమావేశంలో పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి…..
రిపబ్లిక్ హిందూస్థాన్ : కాంగ్రెస్ పార్టీ తెలంగాణ లో జోరు పెంచుతోంది. ఆదివారం తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని ప్రముఖ హోటల్ లో జరిగిన తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ రాష్ట్ర కమిటీ ఎగ్జిక్యూటివ్ సమావేశం జరిగింది. ముఖ్యఅతిథిలుగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి టీపీసీసీ ఇంచార్జ్ మణిక్ ఠాగూర్ గారు , టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి , జాతీయ యువజన కాంగ్రెస్ అద్యక్షుడు బివి శ్రీనివాస్ , జాతీయ యువజన కాంగ్రెస్ ఇంచార్జ్ కృష్ణ అల్లవేరు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి యువజన కాంగ్రెస్ జిల్లా, అసెంబ్లీ అధ్యక్షులకు దిశానిర్దేశం చేశారు . మీరు ప్రజల పక్షాన ప్రభుత్వ వైఫల్యపై కొట్లాడండి నేను మీకు అండగా ఉంటాను అని హామీ ఇచ్చారు. మీరు పార్టీ బలోపేతం కోసం కష్ట పడండి , కష్టపడిన వారి ఇంటికి వచ్చి టికెట్లు ఇస్తానని హామీ ఇచ్చారు .

ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ జిల్లా యువజన కాంగ్రెస్ అద్యక్షుడు , సాయి చరణ్ గౌడ్, ఆదిలాబాద్ అసెంబ్లీ అధ్యక్షుడు ఆర్ఫత్ ఖాన్ , అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి సామ రూపేష్ రెడ్డి , బోథ్ అసెంబ్లీ అధ్యక్షుడు జక్క.బాపు రెడ్డి, ఆదిలాబాద్ అసెంబ్లీ కార్యదర్శి హకీమ్ , ఆదిలాబాద్ నియోజకవర్గ అసెంబ్లీ కార్యదర్శి మారంపెళ్లి సుధా చరణ్ తదితరులు పాల్గొన్నారు.


Recent Comments