Tuesday, October 14, 2025

TS BJP : బీజేపీకి రాజాసింగ్‌ రాజీనామా..!!

హిందుత్వ ఫైర్ బ్రాండ్ లీడర్ , దేశంలోనే నెంబర్ వన్ యూత్ పాలొవింగ్ ఉన్న నాయకుడు గోషామహల్ ఎమ్మెల్యే సంచలన నిర్ణయం తీసుకున్నారు.

Thank you for reading this post, don't forget to subscribe!

ఎన్నోసార్లు ఒంటరిగా గెలిచి బీజేపీ నీ తెలంగాణ లో హాజరు  అయ్యేలా చేసిన రాజా సింగ్ బీజేపీ కి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడం సంచలనంగా మారింది.

తెలంగాణ వ్యాప్తంగా ఒక్క ఎమ్మెల్యే గెలవని రోజుల్లో ఒక్కడే అనేక పర్యాయాలు గెలిచిన ఇప్పటి వరకు ఎలాంటి గుర్తింపు పార్టీలో ఇవ్వకపోవడం , పైగా రాష్ట్ర నాయకులు ఏ పార్టీ అధికారంలో కి వస్తె వారితో లోపాయకారి ఒప్పందం చేసుకుని ముందుకు వెళ్లడం , పార్టీకి తీవ్ర నష్టం చేస్తున్నట్లు గతం లో రాజసింగ్ అనేక సార్లు పేర్కొన్నారు.

తెలంగాణ బీజేపీలో రాష్ట్ర అధ్యక్ష ఎన్నికల కల్లోలం రేపింది. గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు సోమవారం ప్రకటించారు.

చాలాకాలం తర్వాత బీజేపీ కార్యాలయానికి వచ్చిన ఆయన.. కాసేపటికే ఈ ప్రకటన చేయడం గమనార్హం.

తెలంగాణ బీజేపీలో రాష్ట్ర అధ్యక్ష ఎన్నికల కల్లోలం రేపింది. గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు సోమవారం ప్రకటించారు. చాలాకాలం తర్వాత బీజేపీ కార్యాలయానికి వచ్చిన ఆయన.. కాసేపటికే ఈ ప్రకటన చేయడం గమనార్హం.

రాంచందర్‌రావుకు పార్టీ పగ్గాలు అప్పగించడం పై తీవ్ర అసంతృప్తితో ఉన్నా. బీజేపీ అధ్యక్ష పదవికి నామినేషన్‌ వేయాలనుకున్నా. కానీ, నా మద్దతుదారుల్ని బెదిరించారు. నామినేషన్‌ వేయడానికి వస్తే.. వేయనివ్వలేదు. వాళ్లు అనుకున్న వాళ్లకే పదవి ఇచ్చారు.

అందుకే బీజేపీకి రాజీనామా చేస్తున్నా. రాష్ట్ర అధ్యక్షుడికి రాజీనామా లేఖ ఇవ్వడానికే వచ్చా. నాకు మద్దతుగా ముగ్గురు కౌన్సిల్‌ సభ్యులు కూడా రాజీనామా చేశారు. రాజాసింగ్‌ మా పార్టీ సింబల్‌ మీద గెలిచాడు ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యే కాదని, సస్పెండ్‌ చేయాలని కిషన్‌రెడ్డే స్పీకర్‌ను కోరాలి.

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలని ఎంతో పోరాడాము. కానీ, పార్టీ అధికారంలోకి రాకూడదనే ఎక్కువ మంది కోరుకుంటున్నారు.

నేను బీజేపీ కోసం సర్వం ధారపోశాను. నేను, నా కుటుంబం టెర్రరిస్టుల టార్గెట్‌లో ఉన్నాం అంటూ రాజా సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు.

పార్టీ కోసం ఇంత పని చేసినా ఏం లాభం?. అందుకే పార్టీకి లవ్‌ లెటర్‌ ఇచ్చి వెళ్తున్నా. మీకో దండం.. మీ పార్టీకో దండం. లక్షల మంది కార్యకర్తల బాధను ప్రతిబింబించే రాజీనామా ఇది(అంటూ లేఖను చూపించారాయన). బీజేపీకి రాజీనామా చేసినా.. హిందుత్వం కోసం పోరాడుతూనే ఉంటాను అని రాజాసింగ్‌ ప్రకటించారు.

పార్టీ లోనే సరైన పట్టు లేని వారికి పార్టీ పగ్గాలు ఇవ్వడం పై బీజేపీ లో బిన్నస్వరాలు వినిపిస్తున్నాయి.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

మీ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు మాకు పంపండి
error: Content is protected !!