— రైతు స్వరాజ్య వేదిక డిమాండ్
రిపబ్లిక్ హిందుస్థాన్ , ఇచ్చోడ :
ఇచ్చోడ మండల కేంద్రములో ప్రయివేటు వ్యాపారస్తులకు తమ అవసరాలకు కోసం పత్తిని ముల్లేలను తీసుకొచ్చి అతి తక్కువ ధరకు అమ్ముకుంటున్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా గ్రామీణ ప్రాంతములోని ఐకేపీ సెంటర్ ద్వారా కొనుగోలు చేసే విదంగా ప్రయత్నం చేయాలని రైతు స్వరాజ్య వేదిక జిల్లా అధ్యక్షులు సంగెపు బొర్రన్న ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థ అయిన కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సిసిఐ ద్వారా నైనా గ్రామీణ ప్రాంతములో కొనుగోలు చేసే ప్రయత్నం జరగాలని, ఇచ్చోడ చుట్టూరా ఉన్నారా బజారహట్నూర్, నెరడిగొండ, సిరికొండ , గుడిహత్నుర్ మండలాల పరిధిలో ఉన్న వివిధ గ్రామాల నుండి ఆటో మీద తమ పత్తి ముల్లెల్ని తీసుకొచ్చి అతి తక్కువ ధరకు అమ్ముకొని నష్టపోతున్నారని అన్నారు .ఒక క్వింటాలుకు 7300 నుండి 7500 రూపాయల వరకు కొనుగోలు చేసి రైతాంగాన్ని ఆర్థికంగా దివాలు తీస్తున్న సందర్భం కనిపిస్తుందని అన్నారు. ఒక పక్క ప్రకృతి సహకరించక అతి బారి వర్షాలతో పంట నష్టపోయినట్లు పేర్కొన్నారు. నకిలీ విత్తలనాలు రైతాంగాన్ని అంటగట్టి రైతులను ఆర్థికంగా దివాలు తీస్తున్న విత్తన,మందుల దుకాణాల యజమానులు , మరొక పక్క ప్రయివేటు కొనుగోలు దారులు రైతులు పండించిన పంటను అతి తక్కువ ధరకు కొనుగోలు చేసి రైతులను ఆర్థికంగా దివాలు తీస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మునేశ్వర్ ప్రవీణ్, సురేష్, రాజేశ్వర్ జ్ఞానేశ్వరు తదితరులు పాల్గొన్నారు.


Recent Comments