హైదరాబాద్:
నాంపల్లిలో బుధవారం ఉదయం రైలు ప్రమాదం జరిగింది. రైల్వేస్టేషన్‌లో ఛార్మినార్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది.
ఈ ఘటనలో 50మందికి గాయాలయ్యా యి. వెంటనే వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
ఛార్మినార్ ఎక్స్‌ప్రెస్ మూడు బోగీలు పట్టాలు తప్పి ఫ్లాట్‌ఫాం సైడ్‌వాల్‌ను ఢీకొనడంతో ఈఘటన జరిగింది.
ప్రమాదంతో ప్రయాణీకులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. స్టేషన్ ప్లాట్ ఫాంపై రైలు పట్టాలు తప్పడంతో నాంపల్లి నుంచి రాకపోకలు సాగించే మిగతా రైళ్లు ఆలస్యంగా నడిచే అవకాశం ఉందని అధికారులు వివరించారు.
ఇంజన్ తో పాటు ఏసీ బోగీలను తిరిగి పట్టాలపైకి ఎక్కించేందుకు వేగంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
Updates
ఈ నేథ్యంలో హైదరాబాద్లో పలు ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు_*
• నాంపల్లి-మేడ్చల్ మార్గంలో సర్వీసులను రద్దు చేసిన అధికారులు
• చార్మినార్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పిన ఘటన నేపథ్యంలో నిర్ణయం
Recent Comments