సాహసాలు చేయటంలో ఎప్పుడూ ముందుండే భారత ప్రధాని మోడీ… తాజాగా మరో సాహసం చేశారు. గుజరాత్‌లోని ఆధ్యాత్మిక నగరమైన ద్వారకాలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మోడీ..
Thank you for reading this post, don't forget to subscribe!పక్కనే ఉన్న అరేబియామహాసముద్రంలో స్కూబా డైవింగ్ చేశారు. కొన్ని నెలల వ్యవధిలోనే అరేబియా సముద్రంలో మరోసారి డైవింగ్ చేశారు ప్రధాని మోడీ.
బెట్ ద్వారకా ద్వీపం వద్ద ప్రధాని మోదీ నేడు స్కూబా డైవింగ్ చేశారు. స్కూబా డైవింగ్‌కు అవసరమైన దుస్తువులను.. ఎయిర్ బ్యాగ్‌ను ధరించి నీటిలోకి దిగి పురాతన నగరం అవశేషాల వద్దకు చేరి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. తన స్కూబా డైవింగ్ అనుభవాలను సోషల్ మీడియా వేదికగా పంచుకొన్నారు. పురాతన యుగాల్లోని కాలాతీత భక్తికి అనుసంధానమైన అనుభూతిని పొందానని… శ్రీకృష్ణుడు అందరినీ అనుగ్రహిస్తారని..ట్విట్టర్ పోస్టులో రాసుకొచ్చారు. సముద్ర గర్భాన ఉన్న ద్వారకాలో పూజలు చేయడం ఓ దివ్యానుభవమని… ఆ చిత్రాలను పోస్టుకు పిన్ చేశారు. కాగా.. కొన్ని నెలల క్రితం లక్షద్వీప్ లోనూ టూరిజం ఎంకరేజ్ చేస్తూ.. స్కూబా డైవింగ్ చేశారు.
Recent Comments