పదే పదే సిద్ధం అంటున్నారు సీఎం జగన్.. దేనికి సిద్ధం.. జైలుకి జగన్ సిద్ధంగా ఉన్నారా? రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికే జగన్ సిద్ధం అంటూ నిప్పులు చెరిగారు టీడీపీ నేత నారా లోకేశ్.
పలాస శంఖారావంలో నారా లోకేశ్ మాట్లాడారు.
”జగన్ పదే పదే పేదవాడినని చెబుతున్నారు. సొంత చానల్, సొంత సిమెంట్ ప్యాక్టరీ ఉన్నవాడు పేదవాడు అవుతాడా? ప్రజలు ఆలోచించాలి. సూపర్ సిక్స్ అని పవన్, చంద్రబాబు సంయుక్తంగా ఓ మ్యానిఫెస్టో రూపొందించాం. రూ.15వేలు పాఠశాల వెళ్లే విద్యార్ధికి, రూ.20వేలు రైతుకు అందజేస్తాం. ప్రతీ ఏటా మూడు సిలెండర్లు ఉచితం. మహిళలకు 18 సంవత్సరాల నుండి 58 సంవత్సరాల వరకూ ప్రతీ నెల 1500 ఇస్తాం. ఉత్తరాంధ్రకు పట్టిన శని ఈ జగన్. విశాఖపట్నంలో ఒక్క ఇటుకైనా వేశారా? ఒక్క పరిశ్రమ అయినా తెచ్చారా? ఆనాడు నేను ఎన్నో ఐటీ కంపెనీలు తెప్పించా.
రూ.500 కోట్లతో ఓ ప్యాలెస్ కట్టుకుంటున్నారు జగన్. రైల్వే జోన్ కోసం కావాల్సిన భూమిని కూడా ఏర్పాటు చేయలేకపోయారు. విశాఖ ఉక్కు.. ఆంధ్ర హక్కు. రెండు నెలలు ఆగండి. విశాఖ ఉక్కును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొని ఉద్యోగులను ఆదుకుంటాం. జిల్లాలో ఇరిగేషన్ పనులు పెండింగ్ లో ఉన్నాయి. రోడ్డు, బ్రిడ్జిలు జిల్లాలో కట్టింది మా ప్రభుత్వం. ఉద్దానం ప్రజలకు ఉచిత డయాలసిస్ ఏర్పాటు అంతా తెలుగుదేశం ప్రభుత్వం వల్లనే.
1200 కోట్ల రూపాయలతో ఈ పలాస నియోజకవర్గం అభివృద్ది చేశాం ఆనాడు. గౌతు శివాజీ తన నియోజకవర్గం కోసం అసెంబ్లీ సాక్షిగా నన్నే కడిగి పారేసి పనులు చేయించుకున్న నేత మన శివాజీ. సిదిరి అప్పలరాజును గెలిపించారు. మంత్రి నియోజకవర్గంలో అభివృద్ది స్పీడ్ గా ఉండాలి. ఈ మంత్రి ఒక్క రోడ్డు వేశారా? అహంకారానికి మరో రూపం అప్పలరాజు. అప్పలరాజుకు ఓ ముద్దు పేరు ఇచ్చారు. కొండల రాజు అతను. మంత్రిగారూ.. 2 నెలలు ఆగండి.. అంతా కక్కిస్తా… సొంత కార్యకర్తలనే వేధించే మంత్రి ఇతను. నేను పేదమంత్రిని అంటారు. 12కోట్ల లాడ్జి ఎలా కట్టావు పేద మంత్రి అప్పలరాజు? 2వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని లూటీ చేసిన ఘనత అప్పలరాజుదే.
కొత్తగా ఉద్యోగాలు వస్తుంటే దండుకుంటారు ఈ మంత్రి. మేము వస్తే జీడి రైతులకు మద్దతు ధర కల్పిస్తాం. జీడి పరిశ్రమల ఇబ్బందులు కూడా పరిష్కరిస్తాం. ప్రతీ ఇంటికి ఉచిత తాగునీటి కుళాయి ఇస్తాను. కొబ్బరి పరిశ్రమ ఏర్పాటు చేస్తాను. ఆర్మీ కోచింగ్ ఏర్పాటు చేస్తాను. మన ప్రాంతానికి పరిశ్రమలు వస్తే ఎలా ఉంటుంది? తప్పకుండా పరిశ్రమలు తెస్తా ఇది నా హామీ. వలలు, బోట్లు, సబ్సిడీలు ఇవ్వలేదు. వేట నిషేధంలో ఫించను చాలా మందికి ఇవ్వలేదు. చాలామంది అడిగారు. తప్పక అందరినీ ఆదుకుంటాను. టిడ్కో ఇళ్లకు మౌళిక సదుపాయాలు లేవు. మన ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లో టిడ్కో ఇళ్లకు మౌలిక సదుపాయం కల్పించి అందరికీ ఇస్తాం.
100 కోట్ల రూపాయలతో కార్యకర్తలకు భీమా సౌకర్యం ఏర్పాటు చేసింది టీడీపీ. కార్యకర్త చనిపోతే ఆ పిల్లలను చదివిస్తుంది నా తల్లి భువనేశ్వరి. కేసులు ఉన్నా భయపడొద్దు. 2 నెలలు కష్టపడదాం. ఈ పనికి మాలిన మంత్రి అప్పలరాజును తరిమి కొడదాం. ఎర్ర బుక్కు నేషనల్ మీడియాలో కూడా చర్చకు వచ్చింది. చట్టాన్ని ఉల్లఘించిన అధికారుల పేర్లు ఇందులో ఉన్నాయి. ఈ అధికారులు ఎవరినో ఒకరిని పట్టుకుని వచ్చి మళ్లీ పోస్టింగ్ అడుగుతారు. అందుకే పేర్లు రాసుకున్నా. రాబోయే రెండు నెలల కష్టపడితే చాలు మనదే అధికారం” అని నారా లోకేశ్ అన్నారు.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments