రామకృష్ణాపూర్ జనవరి 9 ( రిపబ్లిక్ హిందుస్థాన్):
నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ తెలుగుదేశం పార్టీ పెద్దపల్లి పార్లమెంట్ అధ్యక్షులు సంజయ్ కుమార్ మందమర్రి,రామకృష్ణాపూర్ ఏరియాలోని పలుచోట్ల నెలకొల్పిన పార్టీ ఫ్లెక్సీలను ఓ పార్టీ నాయకులు ఫ్లెక్సీలను చింపడం వాళ్ల చిల్లర బుద్ధిని రాజకీయ వ్యక్తిత్వాన్ని కనబరుస్తున్నాయని తెలుగు యువత పెద్దపల్లి పార్లమెంట్ అధ్యక్షులు వాసాల సాగర్ మండిపడ్డారు.పార్టీ నాయకులు సంజయ్ కుమార్ ఏ పార్టీని విమర్శించకుండా,నిరుపేదలకు సాయం చేస్తూ కార్మిక, కర్షక, శ్రామిక, కాంట్రాక్ట్ లేబర్ సింగరేణి కార్మికుల పోరాటం చేస్తూ పేదవారి పక్షాన నిలబడి వారి హక్కుల సాధనకై పోరాడుతుంటే జీర్ణించుకోలేక నీతిమాలిన సంస్కృతి కలిగిన వారని,మరొకసారి ఫ్లెక్సీల జోలికి వస్తే ఊరుకునే ప్రసక్తే లేదని తగిన బుద్ది చెబుతామని హెచ్చరించారు.
Recent Comments