◾️ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అభ్యర్థులకు పోలీస్ శాఖ లో చేరడానికి రెండవ ప్రక్రియలో భాగంగా దేహదారుడ్య పరీక్షలు రెండవ రోజు ప్రశాంతంగా పూర్తి. ◾️ఎల్లవేళలా మెడికల్ టీం, అత్యవసర సమయంలో అంబులెన్స్ ఏర్పాటు ◾️ 782 అభ్యర్థులకు గాను 667 అభ్యర్థులు హాజరు, 115 అభ్యర్థులు గైర్హాజరు ◾️ రెండవ రోజు 327 అభ్యర్థులు అన్ని పరీక్షలలో ఉత్తీర్ణత పొంది చివరి రాత పరీక్షకు అర్హత సాధించారు◾️ 340 అభ్యర్థులు వివిధ అంశాలలో విఫలం ...
⏺️ జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి
Thank you for reading this post, don't forget to subscribe!రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పోలీసు ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన రెండవ ప్రక్రియలో భాగంగా నిర్వహించనున్న శారీరక దేహదారుల పరీక్షలు రెండవ రోజు విజయవంతంగా పూర్తయ్యాయని జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ప్రశాంత వాతావరణంలో అభ్యర్థులు అన్ని రకాలుగా సహకరిస్తున్నారని, అభ్యర్థులకు ఎటువంటి లోటుపాట్లు లేకుండా అన్ని సౌకర్యాలను కలిగిస్తున్నామని తెలిపారు. ఈ పరీక్షలు పూర్తిగా సాంకేతిక పరిజ్ఞానంతో మానవ ప్రమేయం లేకుండా నిర్వహించబడతాయని ఎటువంటి సందేహం లేకుండా అభ్యర్థులు సంతోషంగా అన్ని పోటీలలో ఉత్సాహంగా పాల్గొంటున్నారని తెలిపారు. రెండవ రోజు 782 అభ్యర్థులు హాజరు కావలసి ఉండగా 667 అభ్యర్థులు హాజరై, 115 అభ్యర్థులు గైర్హాజరయ్యారు. హాజరైన అభ్యర్థులలో 327 మంది అన్ని పరీక్షలలో ఉత్తీర్ణత పొంది చివరి రాత పరీక్షకు అర్హత సాధించారు. 340 అభ్యర్థులు వివిధ అంశాలలో విఫలం చెంది వెనుతిరిగారు. పరీక్ష కేంద్రంలో ఆదిలాబాద్ వైద్య విభాగం ద్వారా ఎల్లవేళలా ఒక మెడికల్ టీం అందుబాటులో ఉంటుందని అలాగే అత్యవసర సమయంలో 108 అంబులెన్స్ ఉంటుందని తెలిపారు. అలాగే ఈ పరీక్షలకు 10 మంది పిఈటిలు 1600 మీటర్ల పరుగు, లాంగ్ జంప్, షాట్ పుట్ అంశాల వద్ద తమ వంతు సహకారాన్ని అందిస్తున్నారని తెలిపారు. ఈ పరీక్షలు నిరంతరం సీసీ కెమెరాల నిఘాలు ఎల్లవేళలా హైదరాబాద్ పోలీసు నియామక మండలి ద్వారా వీక్షించబడుతుందని ఎటువంటి తప్పులు లేకుండా నిష్పక్షపాతంగా పరీక్షలు నిర్వహించబడతాయని తెలిపారు. శనివారం, సోమవారం రెండు రోజులు మహిళా అభ్యర్థుల శారీరక దేహదారుల పరీక్షలు నిర్వహించబడతాయని తెలిపారు. పరీక్షలలో ముఖ్యంగా పోలీసు ముఖ్య కార్యాలయం సిబ్బంది పాత్ర కీలకమని, ఉదయం నాలుగు గంటల నుండి ప్రక్రియ కొనసాగుతుందని సిబ్బంది పూర్తిగా సహకరించి అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూస్తున్నారని సిబ్బందిని కొనియాడారు. మహిళా అభ్యర్థులకు 800 మీటర్ల పరుగు, లాంగ్ జంప్, షాట్ పుట్ అంశాలలో పరీక్షలు నిర్వహించబడతాయని తెలిపారు.
శుక్రవారం రోజు పరీక్షలు నిర్వహించిన అధికారులు అడిషనల్ ఎస్పీలు ఎస్ శ్రీనివాసరావు, సి సమయ్ జాన్ రావు, ఎ అర్ అడిషనల్ ఎస్పీ ఆర్ వెంకటేశ్వర్లు, ఉట్నూర్ ఎ ఎస్పి హర్షవర్ధన్, డీఎస్పీలు వి ఉమేందర్, ఎన్ ఎస్ వి వెంకటేశ్వరరావు, ఎస్ ఉపేందర్, సిహెచ్ నగేందర్, జిల్లా సిఐలు, ఆర్ ఐ లు, ఎస్ఐలు, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్లు, ఐటీ కోర్,ఫింగర్ ప్రింట్, ట్రాఫిక్, కమ్యూనికేషన్, స్పెషల్ పార్టీ, క్యూఆర్టి ఉమ్మడి జిల్లా పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


Recent Comments