అయోధ్య రామ మందిరంలో (Ayodhya Ram Mandhir) ప్రధాని మోడీ (Narendra Modi) రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన చేసిన సంగతి తెలిసిందే. అనంతరం ఆయన మాట్లాడుతూ రాముడికి క్షమాపణలు చెప్పారు.
ఆలయ నిర్మాణంలో జాప్యం జరిగినందుకు రాముడికి క్షమాపణలు చెబుతున్నానని ప్రధాని మోడీ అన్నారు. నేడు చేసిన ఈ పని శతాబ్దాలుగా పూర్తి చేయనందుకు క్షమించాలని మోడీ అన్నారు. ఇన్ని శతాబ్దాలుగా మనం కృషి, త్యాగాలు, తపస్సులు చేసినా ఈ పని జరగలేదని, అందుకు తమను మన్నించాలని రాముడిని కోరారు మోడీ.
ఇప్పుడు రామ్ లల్లా ఒక గుడారంలో కాకుండా ఒక పెద్ద గుడిలో ఉన్నారు. ఇంత అద్భుతంగా టెంపుల్ రెడీ కావడంతో రామ్ లల్లా ఇప్పుడు డేరాలో ఉండడు. జనవరి 22న సూర్యోదయం అద్భుతమైన ప్రకాశాన్ని తీసుకొచ్చింది. జనవరి 22, 2024, క్యాలెండర్‌లోని తేదీ మాత్రమే కాదు. ఇదే కొత్త కాలచక్రానికి మూలం అన్నారు ప్రధాని మోడీ.
శ్రీరాముడు ఒక మతానికి పరిమితం కాదు
శ్రీరాముడు ఒక మతానికి మాత్రమే పరిమితం కాదు. రామమందిరం యావత్ భారతదేశానికి ప్రతీక. అన్ని మతాల వారిని ఏక తాటిపైకి తీసుకెళ్లనున్నారు. రాముడు భారతదేశంలోని ప్రతి మూలలో ఉంటాడు. రామ అంటే జ్యోతి, అగ్ని కాదు. రామమందిరం ఒక దేవాలయం మాత్రమే కాదని, ప్రతి భారతీయునికి చెందుతుందని, ఇది మొత్తం దేశానికి చెందిన ఐక్య దేవాలయమని ఆయన అన్నారు.
శతాబ్దాల తర్వాత మన రాముడు వచ్చాడు
భారతీయుల శతాబ్దాల తపస్సు తర్వాత ఈ రోజు మన రాముడు అయోధ్యకు వచ్చాడు. ఈ క్షణం చాలా పవిత్రమైనది. ఈ క్షణం అత్యద్భుతం. ఈ శక్తి, సమయం మనందరికీ శ్రీరాముడు అందించిన వరం.. వెయ్యేళ్ళ తర్వాత కూడా ఈ తేదీ, ఈ క్షణం గురించి చెప్పుకుంటారు అని అన్నారు మోడీ. ఈ రామాలయ నిర్మాణం సమాజంలోని ప్రతి వర్గం ఉజ్వల భవిష్యత్ వైపు వెళ్లేందుకు స్ఫూర్తినిచ్చింది రామతత్వం శాశ్వతం అని ఆయన పేర్కొన్నారు. ఇది పుణ్యక్షేత్రం కాదు ఇది భారత దేశం యొక్క దార్శనికత అని ప్రధాని అన్నారు.


Recent Comments