కోవిడ్ నిబంధనలు పాటించకుండా గుంపులుగా తిరుగుతున్న జనం…..
అటువైపు కన్నెత్తి చూడని యంత్రాంగం….
దేశంలో కరోనా కేసులు రోజురోజుకు భారీగా పెరుగుతున్న కూడా ఎక్కడా కూడా దాని ప్రభావం కనబడటం లేదు. రోడ్లపై మాస్క్ ధరించని వారికి వేల రూపాయలు ఫైన్లు పడ్డాయి. అయిన కూడా వేల మంది జనం ఒక దగ్గర చేరే చోట ఏ అధికారి కూడా అప్రమత్తంగా ఉండి అక్కడ ప్రజలకు సరైన అవాగహన కల్పిచడం లేదు. సెకెండ్ వేవ్ లో ఎలాగైతే వేల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయో…. అలాంటి ప్రమాదం ఇప్పటికి పొంచి ఉన్న ఎక్కడ కూడా సామాజిక దూరం, కానీ మాస్కులు కానీ లేకుండా జనం తిరుగుతున్నారు. ఫైన్లు వేస్తే సరిపోదు , కఠిన చర్యలు తీసుకోవాలని, మాస్క్ పెట్టుకొని వారికి అప్రమత్తం చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. పై చిత్రం ఇచ్చోడ లో ప్రతి సోమవారం జరిగే మేకల అంగడిలోనిది. వేల మంది జనం ఒక్కడికి మాస్కు లేదు.


Recent Comments